వెయ్యి కోట్ల బడా మూవీలో ఛాన్స్.. సాయి పల్లవి, రష్మిక లో జాక్పాట్ ఎవరు కొట్టారంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయి పల్లవి, రష్మిక మందన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు ఉన్న క్రెజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి స్టైల్ లో వారు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ పాన్ ఇండ‌గియా లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అంతేకాదు.. ఇద్దరి కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటూ.. తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇక వీళ్ల‌లో సాయి పల్లవి.. ఎన్ని కోట్ల ఆఫర్ వచ్చినా సరే తనకు కంటెంట్ నచ్చి.. పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే ఆ సినిమాలో నటిస్తుంది. క‌థ‌ ఒక్కసారి నచ్చకపోతే.. ఇక ఆ ప్రాజెక్టు గురించి ఆలోచన చేయదు. అలాంటి ఎథిక్స్ ఉన్న హీరోయిన్. ఇక రష్మిక ప్రస్తుతం ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. తాను చేసే ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. అంతేకాదు.. ఆమెకు ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్.

RC 17: Sukumar spills details about his next with Ram Charan

ఇలాంటి క్రమంలో సాఫ్ట్ బ్యూటీగా సాయి పల్లవి.. హాట్ బ్యూటీగా రష్మిక మందన దూసుకుపోతున్నారు. అయితే ఇద్దరు వేరు వేరు స్టైల్స్ ఉన్న ఈ ముద్దుగుమ్మల మధ్యన స్ట్రాంగ్ కాంపిటీషన్ ఏంటి.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం టాలెంట్ డైరెక్టర్ సుకుమార్, రామ్ చరణ్‌తో ఓ సినిమా ప్లాన్ చేసిన‌ సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ విషయంలోనే రష్మిక మందన, సాయి పల్లవిల మధ్య కాంపిటీషన్ ఏర్పడిందట. ప్రస్తుతానికి సాయి పల్లవి.. బాలీవుడ్ రామాయ‌ణ్‌ ప్రాజెక్టులో బిజీబిజీగా గడుపుతుంది. ఇలాంటి క్రమంలో సుకుమార్ తన మూవీలో సాయి పల్లవి కే ఛాన్స్ ఇవ్వ‌నున్నాడ‌ట‌. అసలు ఈ రోల్‌ కోసం.. మొదట రష్మిక మందనను భావించాడట.

Sai Pallavi 😍♥️ Vs Rashmika 🤩♥️ - YouTube

పుష్ప తో అమ్మడికి ఎలాంటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఈ క్రమంలోనే రష్మికను హీరోయిన్గా ఫిక్స్ చేయాలని సుకుమార్ భావించాడట. కానీ.. చరణ్ దానికి నో చెప్పేసారని.. ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ బ్యూటీ గా దూసుకుపోతున్న రష్మిక.. సినిమాలో నటించి సినిమా హిట్ అయిన కూడా ఆ నేమ్ అంతా రష్మిక కి వెళ్తుంది.. ఇక నా క్రేజీ ఏమంటుందని ఆలోచనలో పడ్డాడట. పైగా.. రామ్ చరణ్ కు ఎప్పటి నుంచే సాయి పల్లవితో సినిమా చేయాలని ఉంది. ప‌లు ఇంటర్వ్యూల‌లో సైతం ఇన్ డైరెక్ట్‌గా ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలోనే చరణ్.. సాయి పల్లవి తో నటించాలని భావిస్తున్నాడట. కానీ.. మిగతా మేకర్స్ మాత్రం రష్మిక అయితేనే పర్ఫెక్ట్ అని ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో హీరోయిన్ ఎవరనే ఫైనల్ డెసిషన్స్ సుక్కుమార్ చేతిలో ఉంది. ఈ క్రమంలోనే సాయి పల్లవి వర్సెస్ రష్మిక అనే కొత్త హ్యాష్ ట్యాగ్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది.