టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన మూవీ ఘాటి. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో జగపతిబాబు, చైతన్య రావు ,విక్రమ్ ప్రభు తదితరులు ముఖ్య పాత్రలో మెరవనున్నారు. సెప్టెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ ప్రస్తుతం సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌లో ప్రమోషనల్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన క్రిష్ అందులో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఆయన మాట్లాడుతూ కొన్ని కథలు చాలా సహజంగా.. రా అండ్ రెస్ట్రిక్‌గా.. బ్లాస్ట్ కు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఘాటి కూడా అలాంటి కథ అంటూ వివరించాడు. అనుష్క నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడబోతున్నారంటూ క్రిష్ చెప్పుకొచ్చాడు.
తూర్పు కనుమలు.. అందులోని పర్వత శ్రేణులు.. అక్కడున్న తీవ్ర ఎమోషన్స్, చాలా స్ట్రాంగ్ పర్సన్స్, కోపం, మనస్తత్వాలు.. ఇవన్నీ కలగలిపిన మంచి కథను చెప్పడానికి ఘాటి సినిమాతో నాకు అవకాశం దొరికింది అంటూ వివరించాడు కృష్. ఇక ప్రపంచాన్ని నాకు మొదటి పరిచయం చేసింది రచయిత డాక్టర్ చింతకింద. శ్రీనివాసరావు గారు. ఆ తర్వాత దీంట్లో శీలావతి లాంటి బలమైన పాత్ర దొరికిందంటూ వివరించాడు. దాన్ని సినిమాలో అనుష్క పోషిస్తుందని.. ఘాటి సినిమా స్టోరీ విన్న వెంటనే ఇది గొప్ప అడ్వెంచర్స్ సినిమా.. చాలా సవాళ్లతో కూడుకుంది.. కచ్చితంగా ఈ సినిమా చేద్దామని చెప్పిందని వివరించాడు.
ఇప్పటిదాకా.. తాను చేసిన పాత్రల్లో..అత్యుత్తమ నటన కనబరిచిన పాత్ర ఘాటీ అంటూ చెప్పుకొచ్చాడు. థియేటర్లలో ఈ సినిమా చూశాక ఆడియన్స్ ఇదే మాట చెబుతారని వివరించాడు. ఇక గంజాయి నిర్మూలనకు రెండు తెలుగు ప్రభుత్వాలు ఎంతగా కష్టపడుతున్నాయో.. ఉక్కుపాదం మోపుతున్నాయో చూస్తూనే ఉన్నాం. వారి కృషికి మా సినిమా కూడా ఊతమవుతుందని భావిస్తున్నామంటూ వివరించాడు. అనుష్క చాలా స్వీట్ అని అందరికీ తెలుసు. కానీ.. ఆమె ఘాటు. సినిమాలో చాలా ఘాటుగా కనిపించనుంది. సినిమా కూడా అలానే ఉంటుంది. దీని పూర్తిగా రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. నేను ఈ సినిమా షూట్‌ను ఎంతో ఆస్వాదించా. దీంట్లో పోలీస్ పాత్రలో నేను కనిపిస్తున్నానంటూ నటుడు జగపతిబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో రాజు రెడ్డి, విక్రమ్ ప్రభు, చైతు తదితరులు మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు.