ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సౌత్ , నార్త్ అని తేడా లేకుండా.. ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్, హీరో ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుకోవాలని.. ఆడియన్స్‌ను కంటెంట్‌తో మెప్పించి.. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేయాలని ఆహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో తమిళ్ నుంచి కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను రిలీజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. అలా.. తాజాగా కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో కూలి సినిమా రిలీజ్ చేశారు. సన్ పిక్స్చర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు నెగిటీవ్ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
లోకేష్ డైరెక్షన్ ట్రాక్ పూర్తిగా తప్పడంటూ.. సినిమా కంటెంట్ వీక్‌గా ఉందంటూ టాక్ నడిచింది. ఈ క్రమంలోనే సినిమాకు మొదట అనుకున్న కాస్టింగ్ వేరని.. వాళ్ళు సినిమా నుంచి తప్పుకోవడం.. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో వేరే నటీనటులను ఎంపిక తీసుకుని సినిమాలు పూర్తి చేసినట్లు టాక్ నడుస్తుంది. కాగా.. ఈ సినిమా రిలీజ్‌కి ముందు వరకు కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని.. సినిమాను రిజెక్ట్ చేసుకున్న సెలబ్రిటీస్ అంతా చాలా అన్‌లక్కి అంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి క్రమంలో సినిమా రిలీజై టాక్‌తో దెబ్బకు ఈ అభిప్రాయాలన్ని రివర్స్ అయ్యిపోయాయి.
ఇప్పుడు కూలి సినిమాను రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ అంతా డిజాస్టర్ నుంచి తప్పకున్నామని పండగ చేసుకుంటున్నారంటూ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇంతకీ కూలి సినిమాను మొదట రిజెక్ట్ చేసిన సెలబ్రిటీలు ఎవరో ఒకసారి చూద్దాం. మొదట ఈ సినిమా కోసం కమలహాసన్‌ను హీరోగా అనుకున్నాడట లోకేష్. కానీ.. కమల్ నాకు ఇలాంటి కాన్సెప్ట్ సెట్ కాదని చెప్పడంతో రజినినీ.. ఈ సినిమాలో సెలెక్ట్ చేసుకున్నారు. నాగార్జున రోల్ కోసం బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంను భావించినా.. ఆయన ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ ఇవ్వడం కుదరదని చెప్పేసారట. అలాగే.. సౌబిన్ చేసిన పాత్ర కోసం మొదట ఫహాద్ ఫాజిల్‌ను భావించారు. కానీ.. తనకు ఆ క్యారెక్టర్ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్లు లోకేష్ వివరించాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాను మిస్ చేసుకున్న ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారని.. వీళ్ళు సినిమా డిజాస్టర్ నుంచి తప్పించుకున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.