సెకండ్ డే కూడా తగ్గని రజినీ జోరు.. అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు దాటేసిన కూలి..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలన సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఓపెన్ బుకింగ్స్‌తోనే రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. మొదటిరోజు అక్షరాల రూ.151 కోట్ల గ్రాస్ వ‌సూళ‌ను రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ రేంజ్ లో కలెక్షన్ కొల్ల‌గొట్టి మొట్టమొదటి తమిళ్ మూవీ ఇదేనంటూ రజనీకాంత్ రికార్డ్‌ క్రియేటర్ అంటూ అఫీషియల్ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక సినిమా వెయ్యి కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టడం మాత్రం కష్టమే నంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కారణం.. సినిమాకు మిక్స్డ్ టాక్ రావడమే. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్ షో, ఫస్ట్ షో నుంచి మిక్స్డ్‌ టాక్ దక్కింది. ఈ క్రమంలోనే.. సినిమాకు కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. అయితే.. ప్రస్తుతం వీకెండ్ డేస్ జోరు కొన‌సాగుతుంది. ఆగస్టు 15, 16, 17.. ఈ మూడు రోజులు.. వరుసగా లాంగ్ వీకెండ్ కావడంతో.. సినిమా కలెక్షన్ల పరంగా కలిసి వస్తుంది. అలా.. సెకండ్ డే.. సినిమాకు ఆన్లైన్లో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలు మైండ్ బ్లాక్ అయిపోయింది. రెండో రోజు ప్రారంభం కాకముందే అడ్వాన్స్ బుకింగ్ లో ఏకంగా రూ.35 కోట్ల పైగా గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టింది. కూలి రెండో రోజు మొదలైన తర్వాత బుక్ మై షో చూస్తే హిందీ వర్షన్‌కు గంటకు 10 వేలకు పైగా టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

అలాగే.. తెలుగు, తమిళంలోనూ గంటకు 37 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతూ.. ఫుల్ స్వింగ్ లో ఉంది. ఓవరాల్‌గా బుక్ మై షో లో.. ప్రస్తుతానికి గంటకు 47 వేలకు పైగా కూలి టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ ఊపు చూస్తుంటే సినిమా కచ్చితంగా రెండవ రోజు అన్ని భాషల్లోని కలిపి రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలా.. మొత్తానికి రెండు రోజులకు కలిపి రూ.250 కోట్లకు గ్రస్ వ‌సూళ్ల‌కు చేరుకునే అవకాశం ఉంది. ఇక ఈ లాంగ్ వీకెండ్‌ పూర్తయ్యేసరికి దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ మార్కులు కూలీ టచ్ చేస్తుందంటూ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.