సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కూలీ. రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో మంచి అంచనాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో..పూజ హెగ్డే, సౌబిన్ సాహీర్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ లాంటి స్టార్ కాస్టింగ్ అంతా కీలక పాత్రలో నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా.. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజై.. మొదటి రోజు కలెక్షన్లతో రికార్డు క్రియేట్ చేసింది.
కోలీవుడ్ లోనే ఇప్పటివరకు హైయస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు తిరగ రాసిన సినిమాగా కూలీ సంచలనం సృష్టించింది. ఓపెనింగ్ డేనే రూ.151 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని సూపర్ ట్రీట్ ఇచ్చింది. అయితే ఈ రేంజ్ కలెక్షన్‌లు చాలా వరకు ఒపెన్ బుకింగ్స్ వల్ల నమోదయ్యాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మొదటి రోజు వచ్చిన మిక్స్డ్ టాక్ కారణంగా.. సెకండ్ డే సినిమా కలెక్షన్స్ విషయంలో భారీ డ్రాప్ కనిపించింది. ఇండియాలో కూలీ వసూళ్లు మరింతగా తగ్గుతూ వస్తున్నాయి.
కూలీ సినిమాకు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ బరిలో రూ.151 కోట్లు రాగా.. అందులో ఇండియా నుంచి రూ.65 కోట్ల నెట్ వసూళ్లు.. రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఇక రెండో రోజు మాత్రం ఊహించిన రేంజ్ లో కలెక్షన్లు అందుకోలేకపోయింది కూలి. ఇండియన్ మార్కెట్లో మొదటి రోజు రూ.65 కోట్ల నెట్ రాబట్టినా.. రెండవ రోజు ఒక్కసారిగా రూ.50 కోట్లకు పడిపోయింది. ఈ క్రమంలోనే రెండో రోజు అంటే ఆగస్టు 15న రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరుకుంది. ఇక రానున్న ఓవర్సీస్ కలెక్షన్స్ లెక్కల ప్రకారం రూ.250 కోట్ల క్లబ్ లోకి వెళుతుందా లేదా చూడాలి.