టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగా157 రన్నింగ్ టైటిల్‌తో ఓ కామెడీ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పటి నుంచే ఆడియన్స్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి. చిరు కెరీర్‌లోనే 157 సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ మేకర్స్ రిలీజ్ చేస్తే బాగుంటుందంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ మేకర్స్ ఇప్పటికే సిద్ధం చేసేసారని.. ఆగస్టు 22న ఈ గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇక ఆగస్టు 22 మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చేలా ఈ గ్లింప్స్ ప్లాన్ చేశారట మేకర్స్. కాగా సినిమాకు మెగా ఫ్యాన్స్ తో పాటు.. ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యేలా.. ఓ పవర్ ఫుల్ టైటిల్ సెలెక్ట్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తుండగా.. బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఈ సినిమాతో.. వింటేజ్ చిరుని మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకొవస్తానని.. అనిల్ రావిపూడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో మరో సీనియర్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో మెరవనున్నారు. అనిల్ రావిపూడి మార్క్, చిరంజీవి ఎనర్జిటిక్ కామెడీ టైమింగ్, భారీ యాక్షన్‌తో గ్రాండ్ లెవెల్ లో రూపొందుతుందట. మాస్ ప్రేక్షకులకు మూవీతో ఫుల్ మీల్స్ ఖాయం అంటూ తెలుస్తుంది. ఇంతకీ టైటిల్ ఏంటి.. గ్లింప్స్ ఎలా ఉంటాయో.. చిరు కోసం అనిల్ ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడు.. తెలుసుకోవాలంటే ఆగస్టు 22 వరకు వేచి చూడాల్సిందే.