” మన శంకర్ వరప్రసాద్ “టైటిల్ మొదట మెగాస్టార్ ఏ మూవీ కోసం అనుకున్నాడో తెలుసా..?

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఇప్పటికే సినిమా 40 % షూట్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా సినిమా టైటిల్‌తో పాటు.. గ్లింప్స్‌ని కూడా అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ మాట్లాడుతూ.. విక్టరీ వెంకటేష్ రోల్ పై చేసిన కామెంట్స్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచేసింది. అయితే వాస్తవానికి శంకర వరప్రసాద్ గారు టైటిల్.. గతంలో తను వేరే సినిమా కోసం పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాడట చిరు.

Mana Shankara Vara Prasad Garu unleashes another surprise | cinejosh.com

కానీ.. కొన్ని కారణాలతో ఆ సినిమాకు ఈ టైటిల్ వర్కౌట్ కాలేదు. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. శంకర్ దాదా ఎంబిబిఎస్. సోనాలి బింద్రే హీరోయిన్గా మెరిసిన ఈ సినిమాలో.. శ్రీకాంత్ ఏటీఎం పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సినిమా అప్పట్లో మంచి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కాగా.. మొదట ఈ సినిమా కోసం చిరు శంకర వరప్రసాద్ ఎంబిబిఎస్ అనే టైటిల్ భావించాడట. కానీ.. డైరెక్టర్ ఆ టైటిల్ ని కొన్ని కారణాలతో రిజెక్ట్ చేశాడట.

Shankar Dada Mbbs Telugu Cinema Shankar Dada MBBS

క్యారెక్టర్ పరంగా శంకర్ దాదా ఎంబిబిఎస్ టైటిల్ అయితే బాగుంటుందని.. టైటిల్ను లాస్ట్ మినిట్లో చేంజ్ చేశారట. ఒకవేళ ఆరోజు చిరు చెప్పిన టైటిల్ను అంగీకరించి ఉంటే.. అప్పట్లోనే ఈ టైటిల్ మారుమోగిపోయేది. కానీ.. అప్పుడు మిస్ అయిన అనిల్ రావిపూడికి ల‌క్‌ కలిసొచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార మెరవనుంది. ఇప్పటికే సినిమాపై భారీ హైప్‌ నెలకొల్పిన మేకర్స్‌.. సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో.. ఎలాంటి బ‌జ్‌ క్రియేట్ చేసి పెడతారు చూడాలి.