సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. భారీ బడ్జెట్.. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ఆడియన్స్ లో మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. అయినా ఫస్ట్ డే మాత్రం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ సాహిర్ లాంటి స్టార్ కాస్టింగ్ నటించిన ఈ సినిమా.. కథపరంగా వీక్ గా ఉండడంతో.. రెండో రోజు బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోయింది.
ఇక సినిమా రిలీజ్కు ముందే రికార్డ్ లెవెల్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్.. రూ.43 కోట్లకు సినిమా హక్కులను దక్కించుకోగా.. తమిళనాడులో దాదాపు రూ.100 కోట్లు, కర్ణాటక.. కేరళలో రూ.20 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ.85 కోట్లకు రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇలా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా రూ.310 కోట్ల ఫ్రీ రిలీజ్ జరుపుకున్న కూలీ.. రిలీజ్ రోజే ఏకంగా రూ.151 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ముఖ్యంగా.. ఒక తమిళనాడులోనే.. రూ.40 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోను మంచి రెస్పాన్స్ దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
అయితే రెండవ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి హైప్తో కొనసాగిన ఈ సినిమా.. హాలిడే వాతావరణం కారణంగా బలమైన ఆక్యపెన్సీ నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.13 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను దక్కించుకుందని చెబుతున్నారు. తమిళనాడులో రూ.34 కోట్లకు పైగా రాబట్టిందట. ఇక.. హిందీ మార్కెట్లో రూ.7 కోట్లు.. కర్ణాటక, కేరళ, రెస్టాఫ్ ఇండియా లోను భారీగానే కలెక్షన్లు దక్కించుకున్నాయని.. అయితే మొదటి రోజుతో పోలిస్తే ఇది చాలా డౌన్ షాల్ అంటూ చెబుతున్నారు. ఓవర్సీస్లో కలెక్షన్లు మాత్రం బలంగానే కొనసాగుతున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. కూలీ సెకండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు రూ.88 కోట్లు. దీంతో రెండు రోజుల్లో కూలి రూ.243 కోట్లకు చేరువైందని అంచనా.