కూలి నైజాం కలెక్షన్స్.. రజనీకాంత్ ఊచకోత

కోలీవుడ్ థ‌లైవార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కూలి. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో శృతిహాసన్, నాగార్జున, సత్యరాజ్‌, ఉపేంద్ర, పూజ హెగ్డే తదితరులు కీలక పాత్రలో మెరిసిన ఈ సినిమా నిన్న బాక్సాఫీస్ దగ్గర రిలీజై పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే థియేటర్స్‌లో కూలి జోరు చూపిస్తుంది కూలి. ఓపెన్ బుకింగ్స్ తోనే భారీ కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ తాజాగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.

ఏకంగా రూ.151 కోట్ల కలెక్షన్లతో కోలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డ్‌ క్రియేట్ చేసింది. ఇక ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయినా.. నైజాం రికార్డ్స్ పై ఏ సినిమా విషయంలోనైనా స్పెషల్ ఫోకస్ నెలకొంటుంది. అలా సినీ హిస్టరీలోనే నైజాం కలెక్షన్లకు ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. కాగా.. తాజాగా కూలి సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది.

ఇది కోలీవుడ్ సినిమా అయినా.. ఈ రేంజ్ లో వసూళ్లు రావడం అంటే సాధారణ విషయం కాదు. ఇక సినిమాతో పోటీగా వచ్చిన వార్ 2 నైజంలో రూ.4.25 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. కూలీతో పోలిస్తే.. వార్ 2 మొదటి వరుసలో ఉన్న వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌లో మాత్రం వార్ 2 చాలా వెనుకబడిపోయిందనే చెప్పాలి. రజినీకాంత్ నటించిన కూలి సినిమాకు ప్రధానంగా భారీ స్టార్ కాస్టింగ్ తో పాటే.. అనిరుధ్‌ రవిచంద్రన్ మ్యూజిక్ ప్లస్ అయిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.