కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. రీసెంట్గా కనీవినీ ఎరుగని రేంజ్లో భారీ అంచనాలు నడుమ గ్రాండ్‌గా రిలీజై మిక్స్డ్ టాక్ లో దక్కించుకుంది. కాగా.. ఈ సినిమా భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. వరల్డ్ వైడ్‌గా పది రోజుల్లో ఏకంగా రూ.460 కోట్ల గ్రాస్ వసూళను కొల్లగొట్టి ఇప్పటికే కూలీ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కానీ.. తర్వాత మెల్లమెల్లగా కలెక్షన్లు భారీ డ్రాప్ డౌన్ ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఫుల్ రన్లో కేవలం రూ.500 కోట్ల గ్రాస్ కూడా వచ్చే అవకాశం లేదంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ముఖ్యంగా సెకండ్ వీకెండ్లో ఈ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతాయని అంత భావించారు.
ఈ క్రమంలోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ ఖాయం అంటూ అభిప్రాయాల సైతం వ్యక్తం అయ్యాయి. కానీ.. అది అస్సలు వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా బ్రేక్ ఈవెన్ మార్కు చాలా దగ్గరగా చేరుకుంది. ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ అవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రీజనల్ మూవీ అయిన తమిళ్లో మాత్రం ఈ సినిమా ప్లాప్ టాక్ని తెచ్చుకుంది. తమిళనాడులో బయ్యర్ సినిమాను రూ.120 కోట్లకు కొనుగోలు చేయగా.. ఇప్పటివరకు ఈ సినిమాకు కేవలం రూ.130 కోట్ల గ్రాస్ వస్సుళ్లు మాత్రమే దక్కాయి అంటూ.. కేవలం రూ.60 కోట్ల షేర్ కలెక్షన్లు సినిమా సొంతం అవ్వాలంటే రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలి.
మరో రూ.60 కోట్ల షేర్ వస్తే గాని సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం. ఈ క్రమంలోనే తమిళనాడులో సినిమా డిజాస్టర్ ఖాయం అంటూ టాక్ నడుస్తుంది. అయితే.. అన్ని ప్రాంతాల్లో దాదాపు మంచి కలెక్షన్లనే కొల్లగొడుతున్నా.. కేవలం ఒక్క ప్రాంతంలో ఎందుకు డిజాస్టర్ గా నిలిచింది.. రజినీకాంత్ కి తమిళనాడులో ఎందుకు క్రేజ్ తగ్గుతూ వస్తుంది.. అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఒకప్పుడు రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు.. బాక్సాఫీస్ రికార్డ్ల బద్దలు అనే రేంజ్లో సినిమాపై హైప్ ఉండేది. టాక్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో వసూళ్ల వర్షం కురిపించేది. అలాంటి రజనీకాంత్ సినిమా మినిమమ్ రేంజ్ గ్యారెంటీ కూడా లేకుండా.. తమిళ్లోనే డిజాస్టర్‌గా నిలవడం అందరికి షాక్ ను కలిగిస్తుంది.