కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్.. రజనీ ర్యాంపేజ్‌..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. లోకేష్ కనకరాజ్‌ కాంబోలో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ కూలీ. అక్కినేని నాగార్జున, శృతిహాసన్, పూజ హెగ్డే, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందే ఆడియన్స్‌లో భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిగ్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో.. వార్ 2 తెరకెక్కి.. కూలి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. ఓపెన్ బుకింగ్స్ తోనే కూలీ సినిమా రికార్డు లెవెల్ లో కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే.. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం అద్భుతలేమి జరగలేదు.

Coolie box office collection day 1: Rajinikanth-Nagarjuna's action thriller  opens strong | Regional-cinema News – India TV

కారణం.. సినిమాలో కంటెంట్ వీక్ గా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం అవ్వ‌డమే. లోకేష్ కనకరాజ్‌ హిట్ ట్రాక్‌కు ఈ సినిమాతో బ్రేక్ పడిపోయిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాతో డైరెక్షన్‌లో పూర్తిగా ట్రాక్ తప్పిపోయాడని లోకేష్ పై విమర్శల సైతం వెల్లువెత్తాయి. అయినా.. సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం భారీ లెవెల్ లోనే వచ్చాయి. కారణం ఓపెన్ బుకింగ్స్ అంటు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ బుకింగే కాదు.. ఆఫ్‌లైన్ టికెట్ల ద్వారా కూడా భారీ లెవెల్ లోనే కలెక్షన్లు కొల్లగొట్టింది కూలీ.

అలా.. తాజాగా రిలీజ్ అయిన రోజే ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి తమిళ్ మూవీ గా కూలి రికార్డ్‌ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద గురువారం గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా.. రూ.151 కోట్ల పైచిలుకు గ్రాస్ వ‌సూళ‌ను దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ ప్రొడక్షన్ బ్యానర్ అయిన సన్ పిక్చర్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ పోస్టర్‌తో వెల్లడించింది. ఇక రజినీకాంత్ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. సినిమా వీకెండ్ లో రిలీజ్ కావడం కూడా ఓ రకంగా ప్లస్ అయిందని చెప్పాలి. ఈ క్రమంలోనే.. మరో మూడు రోజులపాటు సినిమాకు భారీ ఆక్యుపెన్సీ ఉంటుంది. ఇక సోమవారం నుంచి కూలి రేంజ్ ఏంటో.. ఏ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతుందో.. సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.