సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో భారీ యాక్షన్ థ్రిలర్‌గా వచ్చిన ఈ మూవీలో.. నాగార్జున, ఉపేంద్ర, పౌబిన్సాహిర్, సత్యరాజ్, అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలో మెరుశారు. ఇక ఈ మూవీ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాన్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజైన ఈ మూవీ.. రూ. 151 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టినట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మిశ్రమ ఫలితాలను దక్కించుకోవడం.. సెకండ్ హాఫ్ చాలా చప్పగా ఉందంటూ విమర్శలు ఎదురు కావడంతో సినిమాపై కాస్త ఎఫెక్ట్ పడినా.. కలెక్షన్లు మాత్రం భారీ లెవెల్ లోనే అందుకుంటుంది. ఇక ఆదివారం నాటికి ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న కూలీ.. రిలీజై నాలుగు రోజులు పూర్తయినా.. మంచి హైప్‌తో కొనసాగుతుంది. కూలీ వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. నాలుగు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ లెక్కలకు వస్తే రూ.400 కోట్లకు అటు ఇటుగా దక్కించుకుంది.
బుక్ మై షో పరంగా.. 4.79 మిలియన్ టికెట్లను సేల్స్ చేసిన కూలీ.. తమిళ్ ఇండస్ట్రీలో నాలుగు రోజులకు రూ.135 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి.. ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. కూలీ సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ.600 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే.. ఇంకా రూ.300 కోట్ల షేర్ వసూళ్లను కూలి సినిమా దక్కించుకోవాలి. ఇక ఇప్పటికే రూ. 400కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది కూలి. అంటే.. మరో రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొడితే చాలు.. సినిమా టార్గెట్ ను రీచ్ అయిపోతుంది అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.