టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సుజిత్ డైరెక్షన్‌లో మోస్ట్ ఎవెయిటెడ్ మూవీగా రూపొందుతున్న ఓజి సినిమాపై తాజాగా.. మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓజీ నుంచి అందమైన మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. భారీ బడ్జెట్‌తో ముంబై గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందుతుంది. పాన్ ఇండియా లెవెల్‌లో సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి.
థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీ నుంచి.. కళ్యాణ్ చక్రవర్తి రచయితగా వ్యవహరించిన సువ్వి.. సువ్వి.. అనే సాంగ్ రిలీజ్ చేశారు. శృతిరంజన్ ఆలపించిన ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుణ్ మోహన్ కెమిస్ట్రీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా చూపించారు మేకర్స. కాగా.. పవర్ స్టార్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులో టీం బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే సాంగ్‌కు సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కుతుంది.
కొందరు సాంగ్ బాగుందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం పాటలోని ట్యూన్ సాహిత్యం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సిల్లీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రియాంక పక్కన.. పవన్ హీరోగా అసలు సెట్ కాలేదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోని సాంగ్ కు విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తంగా సాంగ్ ప్రమోషన్స్ పరంగా సినిమాకు ప్రియమైన పబ్లిసిటీ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా ఫైనల్ అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి.