బాక్సాఫీస్ దగ్గర మోస్ట్ ఫైట్‌లలో ఓజీ వర్సెస్ అఖండ 2 కూడా ఒకటి. ప్రెసెంట్ అందరి దృష్టి సెప్టెంబర్ 25 మీదే ఉంది. ఇద్దరు మాస్, మోస్ట్ క్రేజీయస్ట్ స్టార్ హీరోస్ రెండు వైవిద్యమైన కాన్సెప్ట్లతో ఒకేరోజు ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ఎవర్ క్లాష్ అండంలో అతిశయోక్తి లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారని అంతా భావించినా.. ఇప్పుడు అవకాశమే లేదని తేలిపోయింది. దీంతో.. ఈ బిగెస్ట్ క్లాష్‌లో ఎవరు విన్నార్‌గా నిలుస్తారని ఆసక్తి అభిమానులో మొదలైంది. టాలీవుడ్‌కు సంక్రాంతి సీజన్ తర్వాత అత్యంత కీలకమైన సీజన్ దసరా.
ఈ క్రమంలోనే దసరాకు సైతం స్టార్ హీరోలు భారీ సినిమాలను రిలీజ్ చేయాలని పోటీ పడుతూ ఉంటారు. ఇక.. ఈ దసరాకు కూడా అలానే నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ 2, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా.. రెండు సినిమాలు సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నాయి. ఈ రేసులో పవన్ ఓజి నే ఒక అడుగు ముందుంది. కారణం ఓజి షూట్ ఇప్పటికే ముగిసింది. రిలీజ్ అప్డేట్‌తో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇక.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిందని సమాచారం. ఓటీటీ డీల్ పూర్తయిపోయి చాలా కాలం అవుతుంది.
ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ లో మేకర్స్ ఎలాంటి మార్పు చేయదలచుకోలేదట. ఆఖండ 2 విషయంలో మాత్రం ఇంకా కాస్త వరకు పెండింగ్ ఉందని.. కొంత టాకీ తో పాటే ఒక సాంగ్ కూడా షూట్ మిగిలి ఉన్నాయని తెలుస్తుంది. డివోషనల్ యాక్షన్ డ్రామాగా.. రూపొందుతున్న సినిమా కావడంతో.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా సమయమే పడుతుంది. అయినప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదని బోయపాటి శీను క్లారిటీగా వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మారదు. సెప్టెంబర్ 24 పక్క రిలీజ్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో.. ఈ దసరాకు వెండితెరపై భారీ క్లాష్ తప్పదని అర్థమయిపోయింది. ఇక సెప్టెంబర్ 25న వార్ ఏ రేంజ్ లో జరగనుందో చూడాలి.