కూలీ రికార్డుల ఊచకోత.. ఆ ఏరియాలో లియో లైఫ్ టైమ్ వసూళ్లు బ్రేక్..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా కూలీ. అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో, ఉపేంద్ర సౌబిన్ సాహిర్‌, సత్యరాజ్, అమీర్ ఖాన్, శృతిహాసన్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమాపై రిలీజ్‌కి ముందు ఆడియన్స్‌లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఇక సినిమాపై రిలీజ్‌కు ముందు ఈ రేంజ్ లో అంచనాలు పెరగడానికి కాస్టింగ్ ఒక కారణం. అయితే.. హిట్ ట్రాక్‌తో దూసుకుపోతున్న లోకేష్ కనకరాజ్‌, సూపర్ స్టార్ కాంబో కావ‌డం మరో కారణం. ఈ క్రమంలోనే రిలీజ్ కు ముందు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సైతం భారీ లెవెల్ లో రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక సినిమా ఓపెన్ బుకింగ్స్ లోను రికార్డులు క్రియేట్ చేసింది.

ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటిరోజు ఒకింత‌ నెగిటివ్ టాక్‌ను దక్కించుకున్నా.. కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త కూడా ఎఫెక్ట్ పడలేదని సమాచారం. వీకెండ్ మాత్రం వసూళ్లపరంగా కేవలం పాన్ ఇండియా నుంచి కాదు.. అమెరికాలోని సత్తా చాటుకుందని.. కలెక్షన్ల వర్షం కురుస్తుందంటూ సమాచారం. కూలి సినిమాకు ఈ టాక్స్‌తో కూడా రికార్డ్ వసూలు రావడం అంటే సాధారణ విషయం కాదు. ఇక.. తాజాగా ఈ సినిమా యూఎస్ మార్కెట్లో 5.9 మిలియన్ డాలర్లు మార్క్‌ కూడా క్రాస్ చేసి ఆరు మిలియన్ మార్క్‌కు చేరువగా వచ్చేసింది.

మేకర్స్ దీనిని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే.. ఈ సినిమా నెగిటివ్ టాక్‌తోనూ ఈ రేంజ్ లో కలెక్షన్లను ద‌క్కించుకుందంటే.. సినిమాకు అక్కడ ఆడియన్ప్‌లో ఎలాంటి క్రెజ్‌ నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే కూలి సినిమా నార్త్ అమెరికా మార్కెట్‌లో విజయ్ లీయో సినిమా లైఫ్ టైం కలెక్షన్లను బ్రేక్ చేసి.. మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందని.. తమిళ్ సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం టాప్ 3లో జైలర్ వన్ ఉండగా.. ఇప్పుడు కూలి సినిమా లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది. ఇక.. ఫైనల్ రన్ ముగిసేసరికి కూలీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.