బన్నీ రేంజ్‌కు నువ్వు ఎదగలేదు.. నితిన్ పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా ఎదిగిన వారిలో.. ఉన్నది ఉన్నట్లుగా మీడియా ముందు మాట్లాడే వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారు. ఏది మాట్లాడినా పెద్ద సంచలనంగా మారిపోతుందని భయంతో చాలామంది రియాక్ట్ కారు. కానీ.. ఇండస్ట్రీలో సినిమాల విషయమైనా.. ఎలాంటి అంశాల పైన అయినా.. తన అభిప్రాయాన్ని భయం లేకుండా క్లారిటీగా చెప్పే వ్యక్తుల్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఒకడు. అందుకే సక్సెస్‌ఫుల్ నిర్మాతగా ఇప్పటికే రాణిస్తున్నారు. ఇక దిల్ రాజు.. తాజాగా హీరో నితిన్ విషయంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

ఆయన నితిన్ గురించి ముక్కు సూటిగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. హీరో నితిన్ కన్నా నేను ఏడాది జూనియర్ అంటూ చెప్పినా దిల్ రాజు.. నేను అనుకున్న స్థాయికి నితిన్ రాలేకపోయాడని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక తాజాగా నితిన్ హీరోగా వెంకటేశ్వర క్రియేషన్స్ తమ్ముడు మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో లయా, వర్ష బొల్లమా, సప్తమి గౌడ తదితరులు కీలకపాత్రలో మెరవ‌నున్నారు. ఇక తాజాగా.. అన్ని కార్యక్రమాలను ముగించుకున్న ఈ సినిమా జులై 4న ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నాడు. అలా.. తాజాగా ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

దిల్‌తో నిర్మాత అయిన ఆయన.. తర్వాత ఆ సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. ఈ సందర్భంగా నితిన్ అడిగిన ప్రశ్నలకు నిర్మొహమాటంగా సమాధానం చెప్పాడు దిల్ రాజు. దిల్, తమ్ముడు సినిమాల మధ్యలో నితిన్‌లో వచ్చిన మార్పులు ఏంటి ప్లస్లు, మైనస్లు రెండు చెప్పండి అని నేతిని ప్రశ్నించగా.. ఒక నటుడుగా 22 ఏళ్ల లాంగ్ జర్నీ.. నిజం చెప్పాలంటే నాకంటే ఇండస్ట్రీలో ఒక సంవత్సరం నువ్వు సీనియర్.. నువ్వు 2002లో హీరో అయితే.. నేను 2003లో ప్రొడ్యూసర్ గా మారా. నాకు, నీకు ఇద్దరికీ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎలా వచ్చిందో.. నీకు అంతే సామర్థ్యం ఉంది.

Team Dil Raju | Announcing the name and more details on MAY 4th ❤️‍🔥  #DilRaju @srivenkateswaracreations He started with a vision. He gave us...  | Instagram

నీకంటే జూనియర్ అయినా కెరీర్‌లో ఒక్కోటి సాధించుకుంటూ ఒక టాప్ పొజిషన్ కి వచ్చా. నితిన్ ని కూడా అలాగే ఊహించుకున్న. ఎందుకంటే.. దిల్ తీసేటప్పుడు నువ్వు, ఆర్య చేసేటప్పుడు అల్లు అర్జున్ ఫ్యూచర్ స్టార్స్‌లా నాకు అనిపించారు. కానీ.. నువ్వు మాత్రం ఆ మార్క్‌ టచ్ చేయలేకపోయావు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వెంటనే నితిన్ మాట్లాడుతూ.. తమ్ముడుతో పూర్వ వైభవం వస్తుందా అని అడగ్గా.. ఈ సినిమాతో సక్సెస్ఫుల్ హీరో అవుతావు. కానీ.. ఇది సరిపోదు. కొడితే ఎల్లమ్మతో బ్లాక్ బ‌స్టర్ కొట్టాలి అంటూ దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. బలగంతో డైరెక్టర్ గా మారిన కమెడియన్ వేణు డైరెక్షన్‌లో ఎల్లమ్మ మూవీ రూపొంద‌నుంది. దిల్ రాజా ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు.