టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మేరవనున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈనెల 26న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఈ సినిమా పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. ఈ క్రమంలోనే పవన్ అభిమానులో సినిమాపై ఆసక్తి నెలకొంది. అంతేకాదు.. సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్‌లో మరిన్ని అంచనాలను పెంచేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. యూట్యూబ్‌లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇప్పటివరకు లేని ఆల్ టైం రికార్డ్ వీరమల్లు సొంతమైంది రిలీజ్. ట్రైలర్ రిలీజ్ అయ్యిన 24 గంటల్లో ప్రేక్షకుల నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగు వర్షన్ ట్రైలర్ 48 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోగా.. టాలీవుడ్ ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ కు 24 గంటల్లోనే 61.7 మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టినట్లు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా వివరించింది. కేవలం ఈ రికార్డు మాత్రమే కాదు.. భవిష్యత్తులో రాబోయే సినిమాలకు ఇదొక గ్రాండ్ టార్గెట్ ను ఇచ్చిందంటూ మేకర్స్ పేర్కొన్నారు.
హిస్టోరికల్ కథాంశంతో భారీ లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమాలో.. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరవనుంది. బాలీవుడ్ నటుడు బాబి డియోల్, అనుపమ ఖేర్, సత్యరాజ్ లాంటి స్టార్ సెలబ్రిటీస్ అందరూ కీలకపాత్రలో మెరుస్తున్న ఈ సినిమాకు.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దయాకర్ రావు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాత ఏ.ఏం, రత్నం సమర్పణలో క్రిష్ డైరెక్షన్ల మొదలైన ఈ సినిమా.. కొన్ని కారణాలతో జ్యోతి కృష్ణ డైరెక్షన్లో పూర్తయింది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచారు.