టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ పిరియాడికల్ అడ్వెంచర్స్ మూవీ హరిహర వీరమల్లు.. ఈనెల 24న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానున్న క్రమంలో ప్రమోషన్స్‌లో మేకర్స్‌తో పాటు.. హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో నిధి వీరమల్లు సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
వీరమల్లు పార్ట్ 2 కూడా 20 నిమిషాల షూటింగ్ పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చిన ఆమె.. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత పార్ట్ షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతుందంటూ వివరించింది. ప్రొడ్యూసర్ ఏ.ఏం. రత్నం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను భారీ నాణ్యతతో నిర్మించారని.. సినిమా విజయం పై టీం మొత్తం ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నామంటూ వివరించింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో ఎన్నో ట్రైలర్‌తో వాటన్నింటికీ చెక్ పడిందంటూ కామెంట్స్ చేసింది.
ఇక ఈ సినిమా కోసం పవన్ సార్ చాలా కష్టపడ్డారని.. ఎన్నో వర్క్ షాప్స్ చేశారని చెప్పుకోచ్చనని.. సినిమాలోని ప్రతి విభాగంలోనూ పవన్ సార్ బాగమయ్యారంటూ చెప్పుకొచ్చింది. సాంగ్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అన్నింటిలోను సలహాలు ఇచ్చారని.. ఎన్నికల ముందు ఓ ప్రాజెక్ట్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా పవన్ సార్ ఈ సినిమాను పూర్తి చేశారు. విజయవాడలో షూటింగ్ చేసినన్ని రోజులు బ్రేక్ టైంలో ఓవైపు మీటింగ్స్‌లో పాల్గొంటూనే షూటింగ్‌లకు కూడా వచ్చేవారు. ఐదేళ్ల కాలంలో ఆయన వ్యక్తిత్వంలో కొంచెం కూడా మార్పు రాలేదంటూ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.