సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లొకేష్ కరకరాజ్ కాంబోలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ కూలీ. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ప్రధాన పాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు వీళ్లంతా ఎవరి పాత్రలో కనిపించబోతున్నారు అనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఉపేంద్ర, అమీర్ ఖాన్ గెస్ట్ రోల్‌లో మెరుస్తుండగా.. నాగార్జున పాత్ర నడివి మరింత ఎక్కువగా ఉండనుంది. నాగ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇక లోకేష్.. నాగార్జున పాత్ర కోసం స్పెషల్గా క్యారెక్టర్ డిజైన్ చేశాడట. ఆయన్ని ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నించిన లోకేష్.. ఆడియన్స్ అంచనాలను మించిపోయేలా నాగ్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ విషయం రివీల్ అయింది. ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా రిలీజ్ అవ్వాలన్నా సినిమాపై ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ అవ్వాలన్న టీజర్, ట్రైలర్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ.. కూలి విషయంలో మాత్రం లోకేష్ డిఫరెంట్ స్ట్రాటజీని వాడుతున్నాడట. ట్రైలర్, టీజర్ ఏమి రిలీజ్ చేయకుండానే డైరెక్ట్ గా సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
రజనీకాంత్ మూవీ కనుక.. ట్రైలర్ లేకపోయినా ఫ్యాన్స్ ధియేటర్లకు క్యూ కడతారని.. అలాగే నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ క్రేజ్ కూడా సినిమాకు తోడు అవుతుందని స్ట్రాంగ్ బిలీవ్‌తో.. . ఈ క్రమంలోని డిఫరెన్స్ స్ట్రాటజీ వాడుతున్నాడని.. డైరెక్టర్ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఈ ప్లాన్ కు ప్రొడ్యూసర్ల పర్మిషన్ కోసం లోకేష్ కష్టపడుతున్నాడంటూ టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇదే వాస్తవం అయితే.. నిర్మాతలు ఓకే చెప్తే ట్రైలర్ లేకుండా నేరుగా కూలి ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. ఇదే రోజున ఎన్టీఆర్, సూపర్ స్టార్ రజినీకాంత్ డైరెక్టర్ లొకేషన్ కాంబోలో వార్ 2 రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉండనుందో.. లోకేష్ స్ట్రాటజీ సినిమాకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.