టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున రెండవ నటవారసుడిగా.. యంగ్ హీరో అఖిల్ దాదాపు దశాబ్ద కాలం క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటివరకు బిల్ట్ చేసుకో లేకపోయినా అఖిల్.. తన నటిస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో అయిన బ్లాక్ బస్టర్ కొట్టి ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. మురళీకృష్ణ అబ్బురి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా షూట్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.
ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్.. మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ మాస్ లుక్‌తో ఆడియన్స్ థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడని క్లారిటీ వచ్చింది. అయితే.. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీ లీల హీరోయిన్గా మెరవనుంది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అక్కినేని నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతవ ఇదే ఇంట్రస్టింగ్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.
కొడుకు కోసం రంగంలోకి దిగిన నాగ్.. రియల్ లైఫ్ పాత్రనే సినిమాలోను నటించనున్నాడని.. అంటే అఖిల్ తండ్రిగా నాగ్ మెరువలు ఉన్నాడని సమాచారం. ఈ పాత్రను డైరెక్టర్ చాలా పవర్ ఫుల్‌గా డిజైన్ చేశాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుందట. ఇక.. రియల్ లైఫ్‌లో తండ్రి కొడుకులు.. రీల్ లైఫ్‌లో ఎలా నటిస్తారో చూడాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ వార్త వాస్తవమైతే అక్కినేని అభిమానులకు డబల్ ట్రీట్ దొరికినట్టే అనడంలో అతిశయోక్తి లేదు. కాగా ఓ విలేజి యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నాగ వంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.