” 8 వసంతాలు ” బ్యూటీ స్పెషల్ టాలెంట్.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటుంది యంగ్ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్. మ్యాడ్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కేరళ కుట్టి.. మొదటి సినిమాతోనే ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. తన నటనతో ప్రశంసలు దక్కించుకుంది. అందం, అభినయంతో కుర్రకారును క‌ట్టిప‌డేసింది. ఇక‌ త్వరలోనే 8 వసంతాలు మూవీతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి బ‌జ్ నెల‌కొంది. ఫణింద్ర నర్రిశెట్టి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్.. టీజర్, ట్రైలర్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని నెలకొల్పాయి.

ఇక జూన్ 25న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తూ టీం ఫుల్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. తాజాగా.. మంగళవారం ఈ మూవీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సినిమాపై ఆసక్తి పెంచే ఎన్నో విషయాలు టీం పంచుకున్నారు. ఇక హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ టాలెంట్ అయితే ఆడియన్స్‌కు షాక్ ఇచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఈవెంట్లో తన టాలెంట్ ను రివిల్ చేసింది అనంతిక . మొదటి నుంచి ఆవంతిక‌ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి చాలామందికి తెలుసు. తాజాగా ఈమె మరోసారి దానిని ప్రూవ్ చేసుకుంది. 19 ఏళ్ల వయసులో ఇంత టాలెంటా అంటూ అంత షాక్ అయ్యేలా అమ్మడు తన సత్తా చాటుకుంటుంది.

Ananthika Sanilkumar showcases martial arts skills at '8 Vasantalu' pre-release event | Onmanorama

ప్రస్తుతం లాయర్ కోర్స్ చేస్తున్న అనంతిక చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్ కూడా. అంతేకాదు.. కరాటేలో ఆమె బ్లాక్ బెల్ట్, కేరళకు చెందిన కలరిపైట్టు మార్షల్ ఆర్ట్స్ సైతం ప్రావీణ్యత పొందింది. క‌త్తి యుద్ధంలోను శిక్షణ తీసుకుంది. ఇవే కాకుండా కేరళ ట్రెడిషనల్ చండా (డ్రమ్స్) సైతం వాయిస్తుంది. అలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రంగాల్లో తన ప్రతిభను చూపిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా 8 వసంతాలు ప్రే రిలీజ్ ఈవెంట్లో తన టాలెంట్ను రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారడంతో అమ్మడి టాలెంట్ కు అంతా ఫిదా అవుతున్నారు. 19 ఏళ్ళ వయసులో ఈ రేంజ్ లో టాలెంటా అనంతిక.. నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం 8 వసంతాలు సినిమాతో పాటు రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాతోను ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది.