చిరు మూవీ కోసం న‌య‌న్ అలాంటి ప‌నీ.. అనీల్ ఎలా ఒప్పించాడంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్‌లో 157వ‌ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాల్లో వింటేజ్‌ చిరును చూడబోతున్నామని అనిల్ ఇప్పటికే రివీల్ చేశాడు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్‌ నెలకొంది. అయితే.. ఈ సినిమాకు నయనతార హీరోయిన్గా ఒప్పుకోవడమే కాదు.. ప్రమోషన్స్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. న‌య‌న్‌ని ఓ సినిమాకు ఒప్పించ‌డం ఈజీ. కానీ.. ప్ర‌మోష‌న్ల‌కు తీసుకురావ‌డం అంటే ఆధార‌ణ విష‌యం కాదు. చాలావర‌కు సినిమా ఒప్పుకొనేట‌ప్పుడే నేను ప్ర‌మోషన్లకు రానేరాను అని.. ఆమె మెక‌ర్స్‌కు క్లియ‌ర్ గా మ్యాట‌ర్ చెప్పేస్తుంది.

అది ఎంత పెద్ద స్టార్ హీరో మూవీ అయినా న‌య‌న్ ఇదే రూల్ ఫాలో అవుతుంది. దానికి ఒప్పుకుంటేనే ఆమె విళ్ల‌తో సినిమాలు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. అలాంటి న‌య‌న్‌ చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా విష‌యంలో మాత్రం ఎలా త‌న రూల్స్‌ని ప‌క్క‌న పెట్టింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌య‌న్ న‌టించ‌డం వ‌ర‌కు ఓకే కానీ త‌న‌తో ఓ ప్ర‌మోష‌న‌ల్ వీడియో కూడా అనీల్ ఎలా చేయించేశాడు. న‌య‌న్‌లో ఈ స‌డ‌న్ ఛేంజ్ ఏంటి..? త‌మిళ్ మూవీప్‌ ప్ర‌మోష‌న్ల‌కు కూడా వెళ్ల‌ని ఈ అమ్మ‌డు.. మూవీ షూట్ ప్రారంభించ‌క ముందే ప్ర‌మోష‌న‌ల్ వీడియో చేయ‌డం ఏమిటి..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు ఫ్యాన్స్‌. కాగా ఈ మార్పు వెనుక అస‌లు సీక్రెట్ ఎక‌టుంద‌ట‌. అదేంటంటే న‌య‌న్‌కు ఈ ఈ మూవీ కోసం ఇచ్చే రెమ్యునరేషన్ కంటే మ‌రో రెండు కోట్లు ఎక్కువ‌గా ఆఫ‌ర్ చేయ‌డ‌మేన‌ట‌.

అదికూడా కేవ‌లం ప్ర‌మోష‌న్స్ కోసం ఈ రేంజ్‌లో తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. ఆ రూ.2కోట్ల కోస‌మే న‌య‌న్‌.. ఈ సినిమాని ప్ర‌మోట్ చేయ‌డానికి సిద్ధ‌మైంద‌ట‌.ఈ మూవీ మాత్ర‌మే కాదు.. బ‌న్నీ – అట్లీ కాంబో మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తున్న దీపికా ప‌దుకొణె సైతం.. మొద‌ట ఈ మూవీ ప్ర‌మోష‌న్ల‌కు రాను అని చెప్పింద‌ట‌. ఈ క్రమంలోనే దీపికాకు సైతం టీం మరింత రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌మోష‌న్ల‌కు సెప‌రేట్ పేమెంట్ ఇస్తే ఎలాంటి స్టార్స్‌ అయినా.. ఏ రూల్ అయ్యిన బ్రేక్ చేసి త‌లాడిస్తూ వ‌చ్చేస్తార‌ని టాక్ న‌డుస్తుంది. మరి హీరోయిన్ల ప్రమోషన్ల కోసమే అదనంగా రెమ్యూనరేషన్లు ఇస్తున్న మేకర్స్‌కు ఏమైనా ఉపయోగం ఉంటుందా.. లేదా..? హీరోయిన్స్ వల్ల ఈవెంట్స్ కు గ్లామర్ వస్తుంది కానీ.. ప్రమోషన్స్ వల్ల ఆడియన్స్ లో హైప్‌ పెరుగుతుందా.. జనాలను థియేటర్లకు రప్పించగలరా.. మరిన్ని టికెట్లు తెగుతాయా.. అనే సందేహాలు మాత్రం అందరిలో మొదలయ్యాయి.