” హరిహర వీరమల్లు ” అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యేది అప్పుడే.. ఇక రచ్చ రచ్చే..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆల్మోస్ట్ పండగ మొదలైపోయినట్టే. సుమారు మూడు ఏళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అంటూ పవన్ సినిమాల కోసం కళ్ళు కాయలు ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వచ్చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీబిజీగా గ‌డుపుతున్న ప‌వ‌న్‌.. సినిమాల విషయంలో మాత్రం చాలా స్లోగా ఉన్న సంగతి తెలిసిందే. గ‌త‌ పదేళ్ల నుంచి అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తు.. చాలావరకు ఫ్లాప్ లను చూస్తూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఫ్లాప్‌, హిట్లు ఏమి కొత్త కాదు. ఈ క్ర‌మంలోనే పవన్ చివరి రెండు సినిమాలు మాత్రం భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అయితే.. ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. గత ప్రభుత్వం టికెట్ రేట్స్‌, బెనిఫిట్స్, స్పెషల్ షోస్ ఇవ్వకపోవడంతో సినిమాలు భారీ వసూళ్లను మాత్రం దక్కించుకోలేకపోయాయి.

ఈ క్రమంలో ఉన్న ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేసినా.. ప్రస్తుతం ఉన్నది అనుకూలమైన ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో ఇష్టం వచ్చినన్ని షోస్ వేసుకునే ఛాన్స్ ఉంది. ఇక విశ్వసినీయ వర్గాల సమాచారం ప్రకారం.. హరిహర వీరమల్లు సినిమాల్లో జూన్ 11 రాత్రి 11 గంట‌ల‌ 59 నిమిషాల నుంచి ప్రీమియర్ షోస్ ప్రారంభిస్తారని టాక్‌ నడుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్ తెలుగు రాష్ట్రాలలో జూన్ 9 నుంచే ప్రారంభం కానున్నాయట. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎలాగు టికెట్ రేట్లు పెంపుకి అనుమతులు వచ్చేస్తాయి. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా టికెట్ రేట్స్ పెంపు కష్ట‌ తరిమే. ఒకవేళ టికెట్ రేట్స్ పెంపు వచ్చినా.. బెనిఫిట్ షోస్‌కు మాత్రం అసలు అనుమతులు ఉండవు. ఇక పవన్ తెలంగాణ ప్రీమియర్ షో టికెట్ రేట్ల విషయంలో మాత్రం ముందు ముందు ఏం చేయబోతున్నారనేది వేచి చూడాలి.

కాగా.. వీరమల్లు ఓవర్సీస్ రైట్స్‌ సైతం భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం.ఇక‌ ఈ గురువారం లేదా శుక్రవారం నుంచి సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్లు నార్త్ అమెరికాలో ప్రారంభించనున్నారు. కేవలం నార్త్ అమెరికా నుంచి సినిమాకి మూడు మిలియన్ డాలర్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఇక నేడు ఈ సినిమా థియేట్రిక‌ల్‌ ట్రైలర్ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు టీం ఇది ఆడియన్స్ను ఆకట్టుకుని అదే రెయిన్స్లో రెస్పాన్స్ దక్కించుకుంటే మాత్రం ఇక సినిమాకు తిరుగుండ‌దు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికి నార్త్‌ అమెరికాలో టాప్ ప్రీమియర్ గ్రాస్ కలెక్షన్లను ఒకసారి పరిశీలిస్తే.. కల్కి దాదాపు 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను కొల్లగొట్టగా.. పుష్ప 2.. 3.5 మిలియన్ రాబట్టింది. దేవర సినిమా 2.8 మిలియన్ డాలర్లు, ఆర్‌ఆర్‌ఆర్ సినిమా 2.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వ‌పూళ్లు నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధం అవుతున్న‌ హరిహర వీరమల్లు ఈ గ్రాస్‌రికార్డుల‌ను బ్రేక్ చేస్తుందో లేదో వేచి చూడాలి.