బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేశాడు రాజమౌళి. ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో అద్భుతాలు సృష్టించగలుగుతుంది అంటే దానికి బీజం వేసింది జక్కన్న అనడంలో సందేహం లేదు. ఆయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. మన తెలుగు సినిమాలు కూడా అందరిని మెప్పిస్తాయని ప్రూవ్ చేశాడు. దీంతో తర్వాత టాలీవుడ్ నుంచి ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజమౌళి తన సత్తాను పాన్ వరల్డ్ రేంజ్‌లో చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు. మహేష్ బాబుతో ప్రస్తుతం జక్కన్న ఓ పాన్ వరల్డ్ సినిమాకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రాజమౌళి క్రేజ్ రోజురోజుకు మరింతగా పెరుగుతుంది. దీంతో రాజమౌళి సినిమాలకు యూట్యూబ్ లో కూడా గిరాకీ బాగా పెరిగిపోయింది. ఆయన నుంచి వచ్చిన ఇంటర్వ్యూస్.. గతంలో ఇచ్చిన స్పీచ్లు ఇలా ప్రతిదీ విపరీతమైన వ్యూస్ సంపాదించుకుంటూ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. కారణం ప్రస్తుతం రాజమౌళి పేరు పాన్ ఇండియా లెవెల్ లో ప్రత్యేక ఆదరణ దక్కించుకోవడమే. దాదాపు టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల రేంజ్ లో రాజమౌళి క్రేజ్ ఉందన్నడంలో సందేహం లేదు. అందుకే జక్కన్న ఎక్కడ కనిపించినా అభిమానులు ఆయనకు నీరాజనాలు పడుతున్నారు.
స్టార్ హీరోల కంటే ఇప్పుడు జక్కన్న స్టార్‌డం ఎక్కువగా ఉంది. దాదాపు పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోస్ అంతా రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే బాగుండంటూ ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఓ సాధారణ చిన్న హీరోని సైతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మార్చగల సత్తా ఉన్న డైరెక్టర్గా రాజమౌళి ఇప్పటికే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. తను తెరకెక్కించే సినిమాలో పర్ఫెక్షన్.. ఆయన పడుతున్న కష్టం కారణంగానే జక్కన్నకు ఈ రేంజ్‌లో పాపులారిటీ వచ్చింది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే రాజమౌళి డైరెక్షన్‌లో నటించిన ఎంతోమంది నటులు.. ఈ విషయంపై తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. ఒక సినిమాను చేయాలని ఫిక్స్ అయితే పని రాక్షసుడిలా.. దానికోసం ఎంతైనా కష్టపడతారని, పర్ఫెక్ట్ అవుట్ ఫుట్ వచ్చేవరకు ఆ నటులను కూడా ఇబ్బంది పెట్టేస్తాడు అంటూ వారు వర్ణించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో జక్కన్న.. మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడు అనే ఆశక్తి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో నెలకొంది.