యూఎస్ మార్కెట్‌లో చ‌ర‌ణ్ గేమ్‌ చేంజ‌ర్ టార్గెట్ ఫిక్స్‌.. ఎన్ని కోట్లు రావాలంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ కోసం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్‌లో అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలను సెట్ చేసుకున్న ఈ సాలిడ్ కమర్షియల్ పొలిటికల్ డ్రామా మోస్ట్ అవైటెడ్ మూవీ గా ఆడియన్స్ ముందుకు రానుంది.

పండుగ వేళ.. గేమ్ చేంజర్ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. | Game changer 2nd  single announcement this september-10TV Telugu

ఇక ఈ సినిమాతో.. శంకర్ తన మార్క్ హిట్ ఇచ్చి మళ్ళీ కం బ్యాక్ కావ‌డం కాయం అంటూ మేకర్స్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కంటే ముందే.. సినిమా నుంచి వరుస అప్డేట్లను రిలీజ్ చేస్తూ వచ్చారు మూవీ టీం. ఈ క్రమంలోనే సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్‌ పెరిగింది. కాగా తాజాగా గేమ్ చేంజర్ బిజినెస్ డీల్స్ కి సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. యూఎస్ మార్కెట్లో గేమ్ చేంజర్‌ టార్గెట్ లాక్ అయిందని టాక్ నడుస్తుంది. గేమ్ చేంజ‌ర్‌ యూఎస్ మార్కెట్‌లో 4.5 మిలియన్ డాలర్ టార్గెట్ తో దిగనున్నట్లు సమాచారం.

Game Changer Songs Download 2024 | Game Changer Naa Songs Telugu

అంటే ఇండియ‌న్ రూపీస్‌లో రూ.35 కోట్ల పై చిలుకు టార్గెట్‌తో అక్క‌డ సినిమా లాక్ అయ్యింద‌ట‌. ఇప్పటివరకు తెరకెక్కిన చరణ్ సోలో సినిమాలన్నిటిలో ఇదే హైయెస్ట్ బిజినెస్ టార్గెట్ అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో లేదో వేచి చూడాలి. ఇక దిల్‌రాజు ప్రదేశాలుగా వ్యవహరించిన ఈ సినిమాకు థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా అభిమానులంతా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాయం అంటూ.. చరణ్ మరోసారి తన మార్క్ నటనతో సత్తా చాటుకుంటాడు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.