ఎస్ .. ప్రజెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇదే కామెంట్స్ చేస్తున్నారు . మనకు తెలిసిందే రెబెల్ ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న కల్కి సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే అమెరికాలో ఒక షో కంప్లీట్ అయిపోయింది .. రెండో షో కూడా పడిపోయి ముగింపు దశకు వచ్చేసింది. ఇండియాలో ఫస్ట్ షో కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన టాక్ కూడా నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కల్కి సినిమాను ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు .
ఇప్పటివరకు ఇండస్ట్రీలో తోపైన డైరెక్టర్ అంటే రాజమౌళి మాత్రమే అనుకున్నాము అని .. ఆయనకు 100 రెట్లు బలంతో తెలివితేటలతో విజన్ తో చాలా చాలా అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు అని కామెంట్స్ చేస్తున్నారు . కల్కి సినిమా చూసిన రెబల్ అభిమానులు రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు. దట్ ఇస్ డార్లింగ్ ఎప్పుడు వచ్చామా అన్నది కాదు హిట్టు కొట్టామా లేదా అన్నదే పాయింట్ అంటూ పోకిరి సినిమాలోని డైలాగ్ ను మరొకసారి గుర్తు చేస్తున్నారు .
కల్కి సినిమా చూసిన రెబల్ ఫ్యాన్స్ థియేటర్స్ కి వెళ్లే వాళ్ళు ఇవి కంపల్సరీ తీసుకెళ్లండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు . కచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి అని.. ప్రభాస్ ఇంట్రడక్షన్ స్సిన్ అప్పుడు అరిచి అరిచి గొంతు ఎండిపోతుంది అని .. అదేవిధంగా ఇంటర్వెల్ ట్విస్ట్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయ్ అని కచ్చితంగా బ్యాగ్ నిండా పేపర్స్ తీసుకెళ్లి ఆ అరుపు ఆ ఎంజాయ్మెంట్ ఆ ఊపుతో సినిమా చూస్తేనే కిక్ వస్తుంది అని .. తమదైన స్టైల్ లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా మన పురాణాలను బేస్ చేసుకుని నాగ్ అశ్వీన్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అన్న తన విజయాన్ని కోట్లాదిమంది జనాలకు అర్థమయ్యే రీతిలో తెరకెక్కించడం ఆ కాన్సెప్ట్ సినిమాకు హైలైట్ గా మారింది . చాలామంది ప్రముఖులు కూడా నాగ్ అశ్వీన్ తీరుని పొగిడేస్తున్నారు..!!