సాధారణంగా మనకి ప్రభాస్ అంటే ఎలాంటి రోల్స్ గుర్తొస్తాయి.. ఒక మిస్టర్ పర్ఫెక్ట్.. ఒక ఛత్రపతి ..ఒక వర్షం లాంటి మూవీస్ ఏ .. మనం ఎక్కువగా చూస్తుంటాం . అయితే ప్రభాస్ లో కూడా తెలియని ఒక కమల్ హాసన్ లాంటి నటుడు దాగున్నాడు అన్న విషయాన్ని ఒక్కొక్క డైరెక్టర్ బయటపెడుతూ వస్తున్నారు . మరీ ముఖ్యంగా కేవలం మాస్ పాత్రలకే సెట్ అయ్యే బాడీ నేచర్ ఒకరిది .. రొమాంటిక్ పాత్రలకు మాత్రమే సెట్ అయ్యే బాడీ కల్చర్ మరొకరిది .. అయితే ఎలాంటి పాత్రలకైనా సరే తన బాడీ సెట్ అవుతుంది అన్న విషయాన్ని తాజాగానే ప్రూవ్ చేశాడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ .
రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంత సాఫ్ట్ గా ఎమోషనల్ గా ఉంటుందో తెలిసిందే. అదే విధంగా పౌర్ణమి సినిమాలో చాలా సెంటిమెంటల్ ఫెలో గా కనిపిస్తాడు . ఇక బుజ్జిగాడు సినిమా విషయానికి వస్తే మాత్రం టూ నాటీ గా అదరగొట్టేస్తాడు. డార్లింగ్ డార్లింగ్ అంటూ తనదైన రేంజ్ లో ఆకట్టుకునేసాడు . అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆయన నటించిన సినిమాలలో బాగా ఎంటర్టైన్ చేసే సినిమా ఏది అంటే మాత్రం కచ్చితంగా బుజ్జిగాడు సినిమా అని చెబుతారు. ఆ సినిమాలో ఏ విధమైనటువంటి కామెడీ యాంగిల్ లో మనం ప్రభాస్ ని చూసామో ..ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే క్యారెక్టర్.. ఇంకా పక్కాగా చెప్పాలంటే కూసింత ఎక్కువ రేంజ్ లోనే నాగ్ అశ్వీన్ ప్రభాస్ చేత కామెడీ పండించాడు.
ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన కల్కి . ఈ సినిమా కొద్దిసేపటి క్రితిమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఈ సినిమా టాక్ చూస్తుంటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి . ఇప్పటివరకు ఇండస్ట్రీలో బాహుబలి సినిమానే తోపు అనుకున్న వాళ్ళకి కాదు కాదు కల్కి సినిమా అంతకుమించి అనే రేంజ్ లో తెరకెక్కించాడు నాగ్ అశ్వీన్. మరీ ముఖ్యంగా ప్రభాస్ క్యారెక్టర్ .. ప్రభాస్ నటించిన తీరు పండించిన కామెడీ సినిమాకే హైలెట్గా మారింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ని మనం ఒక మల్టీ డిఫరెంట్ యాంగిల్ లో ఉన్న క్యారెక్టర్ ని చూసాం ..అటు నాటి బాయ్స్ కి ఇటు అమ్మాయిలకి అదేవిధంగా టెక్నాలజీ ఇష్టపడే వారికి అదేవిధంగా పురాణాలను గౌరవించే పెద్దలకి అందరికీ నచ్చే పాత్రలో కనిపించాడు ప్రభాస్ . దీంతో సోషల్ మీడియాలో ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!