నమ్మక ద్రోహివే నువ్వు..స్టార్ హీరోయిన్ ని బూతులు తిడుతున్న మహేశ్ బాబు ఫ్యాన్స్.. ఎందుకంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొంతమంది జనాలు మరీ హద్దులు మీరిపోతున్నారు . ఎంతలా అంటే నోటికొచ్చిన విధంగా స్టార్ హీరోయిన్స్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు . వాళ్ళు ఏ విషయం మాట్లాడిన సరే తమ ఫేవరెట్ హీరో గురించి మాట్లాడకపోతే మాత్రం రాద్ధాంతం చేస్తూ రచ్చ రంబోలా చేసేస్తున్నారు . తాజాగా అలాంటి చిక్కుల్లో ఇరుక్కునింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. టాలీవుడ్ చందమామగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ప్రెసెంట్ ఎలాంటి స్థానంలో ఉందో మనకు తెలిసిందే.

మరి ముఖ్యంగా కాజల్ అగర్వాల్ సత్యభామ అనే సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టడానికి ఈగర్ గా వెయిట్ చేస్తుంది . కాగా కాజల్ అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” తెలుగు ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన హీరోలు రామ్ చరణ్ – అల్లు అర్జున్ అంటూ హీరోయిన్ సమంత అంటూ చెప్పుకొచ్చింది”. దీంతో ఒక్కసారిగా మిగతా హీరో ఫ్యాన్స్ కాజల్ పై విరుచుకుపడుతున్నారు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ మండి పడుతున్నారు .

Hot Photos of Kajal Agarwal in Businessman Movie

మా హీరో అంటే నీకు ఇష్టం లేదా..? బిజినెస్ మాన్ సినిమా హిట్ ఇచ్చింది మా హీరోనే ..? అంటూ కాజల్ నీ ఫేస్ కి అంత సీన్ లేదు నువ్వు ఆంటీ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరు నువ్వు నమ్మకద్రోహివి ఎంతోమంది స్టార్స్ నీకు హిట్ ఇస్తే కేవలం బడా టాప్ హీరోలను మాత్రమే నువ్వు ఇష్టమైన హీరోలుగా చెబుతున్నావు .. వాడుకొని వదిలేసే టైప్ అంటూ ఘాటుఘటుగా కౌంటర్స్ వేస్తున్నారు..!!