ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలు.. వాటి రిలీజ్ డేట్‌లు ఇవే..

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో సినిమాలన్నీ కంటెంట్ ఉన్నా, లేకపోయినా పాన్ ఇండియా రేంజ్ అంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో పాన్ ఇండియా సినిమాలపై జనాలకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. స్టార్ హీరోలు మరియు స్టార్ డైరెక్టర్ల కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలపై మాత్రమే ప్రేక్షకుల్లో హైప్ నెలకొంది. అలా ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీలుగా ఉన్న పాన్‌ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే అందులో కొన్ని సినిమాల రిలీజ్ డేట్లను ఫిక్స్ చేశారు. మరికొన్ని సినిమాలు ఏ సమయంలో వస్తాయో కొన్ని అంచనాలు ఉన్నాయి. ఇంతకీ ఆ మూవీలో ఏంటి.. ఏ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం.

NTR's Devara: Stunning Glimpse will be out on January 8th

దేవర :
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్లో నటిస్తున్న మూవీ దేవర. ఈ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు కొరటాల గతంలో పేర్కొన్నాడు. ఇక దేవర మొదటి భాగం ఈ ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kalki 2898 AD Glimpse | Prabhas | Amitabh Bachchan | Kamal Haasan | Deepika  Padukone | Nag Ashwin - YouTube

కల్కి 2898 ఏడి :
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, నాగ అశ్విన్ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా స‌లార్‌ బ్లాక్ బ‌స్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ ఏడాది మే నెలలో కల్కి ప్రేక్షకుల ముందుకి వచ్చే అవ‌కాశ‌లు ఉన్నాయి.

Pushpa: The Rule - Part 2 (2024) - IMDb

పుష్ప 2 :
ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ చివరిగా నటించిన మూవీ పుష్ప బ్లాక్ బ‌స్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా పాపులారిటీ దక్కించుకున్న ఈ సినిమాకు అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇక ఈ సినిమా రెండో భాగాన్ని (పుష్ప 2) ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Game Changer (2024) - IMDb

గేమ్ చేంజర్ :
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సినిమా తరువాత పాన్ ఇండియా లెవెల్లో నటిస్తున్న మూవీ గేమ్ చేంజర్. పాన్ ఇండియా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో రిలీజ్ చేసే ఛాన్సులు ఉన్నాయి.