చిరూకి ఫ్యాన్స్ అంటే అంత చిన్న చూపా.. వాళ్ళు ముట్టుకుంటే సబ్బుతో చేతులు కడుక్కుంటాడా..!?

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో గత 4 దశాబ్దాలుగా తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అదేవిధంగా ప్రజారాజ్యం పేరుతో రాజ‌కీయ పార్టీని స్థాపించి కొంతకాలం రాజకీయాల్లో కొనసాగాడు తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇక ఏ రంగంలోనైనా ఓ వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే అతన్ని అభిమానించే వారితో పాటు హేటెర్స్ కూడా కచ్చితంగా పెరుగుతూ ఉంటారు. అదేవిధంగా ఈయన గురించి కూడా ఎన్నో నెగటివ్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

మొగల్తూరులో పుట్టిన చిరంజీవి తన సొంత ఇల్లు లైబ్రరీ కోసం రూ.3 లక్షలకు అమ్ముకున్నారు అంటూ గతంలో ఓ వార్త‌ వైరల్ అయింది. అంతేకాకుండా ఆయన చదివిన కళాశాలలో ఈవెంట్ కి గెస్ట్ గా రమ్మంటే రూ.5 లక్షల రెమ్యూనరేషన్ అడిగాడు అంటూ దాంతో చిరంజీవిని కాదని సుమన్ ఈవెంట్ కు పిలిచారని.. కొంత‌కాలానికి చిరంజీవి తన చదువుకున్న కాలేజ్ దగ్గరకు ప్రచారం కోసం వెళ్ళగా వారు చిరంజీవిని లోపలికి అనుమతించలేదని వార్తలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.

అలాగే చిరంజీవి ప్రచారంలో భాగంగా అభిమానులు ముట్టుకున్నప్పుడు వెంటనే వచ్చి సబ్బుతో చేతులు వాష్ చేసుకునేవాడట ఇలా ఇప్పటికే చిరంజీవి పై ఎన్నో నెగటివ్ న్యూస్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇదంతా చిరుని రాజకీయంగా దెబ్బతీయడానికే కొంతమంది ఈ పుకార్లని సృష్టించార‌ని ఎలాంటి నిజం లేదంటూ ఎప్పటికప్పుడు మెగా ఫాన్స్ వాటిని ఖండిస్తూ ఉంటారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది 2008లో కాగ‌ 2005లో ప్రచారం చేశారని.. ఆ సమయంలో ఫ్యాన్స్ ముట్టుకుంటే సబ్బుతో కడుక్కున్నారంటూ ఆరోపణలు చేశారు.

అసలు ఆ నిందలకు పొంతన ఏమైనా ఉందా అంటూ అభిమానులు ఫైర్ అయ్యారు. ఇక అలాగే చిరంజీవి సొంత ఇంటిని 3 లక్షలకు అమ్మేశారు అంటూ వచ్చిన వార్తలపై జర్నలిస్ట్ ప్రభు క్లారిటీ ఇస్తూ చిరంజీవికి మొగల్తూరులో ఇల్లు లేదని అంజనీదేవి తండ్రి గారిని అంటే చిరంజీవి తాత మేనమామల ఇల్లు అని వాళ్ళు ఎప్పుడో ఆ ఇంటిని అమ్మేసుకున్నారని ఆ ఇల్లు అమ్మడంలో చిరంజీవికి ఎటువంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇవన్నీ చిరంజీవి పై నెగిటివ్ వైబ్స్ రావడానికి క్రియేట్ చేసిన రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చాడు అయితే ప్రస్తుతం ఈ న్యూస్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.