సీటు రాకపోతే ఇండిపెండెంట్..టీడీపీ-జనసేనలో కొత్త రచ్చ.!

టీడీపీ-జనసేన పొత్తు కొత్త సమస్యకు దారి తీసేలా ఉంది. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు కానీ..కింది స్థాయిలో రెండు పార్టీల శ్రేణులు ఎంతవరకు కలుస్తాయి. ఎంతవరకు సహకరించుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. సీటు తమకంటే తమకని అనుకుంటున్నారు.

ఇలాంటి పరిస్తితుల్లో ఒక పార్టీకి సీటు దక్కితే మరొక పార్టీ నేత ఇండిపెండెంట్ గా బరిలో దిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఉదాహరణకు రాజమండ్రి రూరల్ సీటు ఉంది. ఇక్కడ టి‌డి‌పి సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ ఉన్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనే బరిలో దిగే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ జనసేనకు బలం ఎక్కువ ఉంది. దాదాపు 40 వేల పైనే ఓటింగ్ ఉంది. కాబట్టి ఈ సీటు తమకు కావాలని జనసేన అంటుంది. కానీ టి‌డి‌పి సీనియర్‌ని పక్కన పెట్టడం కష్టం. అలాంటప్పుడు ఇక్కడ జనసేన ఏం చేస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది.

అటు రాజానగరంలో ఇటీవలే టి‌డి‌పి, జనసేన ఇంచార్జ్‌లని ప్రకటించారు. ఇంకా సీటు తమకంటే తమకని అనుకుంటున్నారు. దీంతో ఒక పార్టీకి సీటు ఇస్తే మరొక పార్టీ సహకరిస్తుందా? లేక ఆ నేత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అనే డౌట్ వస్తుంది. ఇటు ముమ్మిడివరంలో టి‌డి‌పి నేత దాట్ల సుబ్బరాజు ఉన్నారు. ఇటు జనసేన నేత పితాని బాలకృష్ణ ఉన్నారు.

ఇద్దరు సీటు కోసం పోరాడుతున్నారు. కానీ ఎవరో ఒకరికే సీటు దక్కుతుంది..దీంతో మరొకరు ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇలాంటి పరిస్తితులే నడిస్తే..పొత్తు ఫెయిల్ అయి వైసీపీకి లాభం జరుగుతుంది.