ప్రభాస్ ” రాజాసాబ్ ” సెన్సార్ కంప్లీట్ టాక్ ఎలా ఉందంటే..

పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు ఫుల్ సీరియస్ యాక్షన్ మోడ్‌లోనే కనిపించాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్‌ని చూడబోతున్నామని అభిమానుల్లో ఆనందం మొదలైంది. ఇక ప్రభాస్ కెరీర్‌లోనే మొట్టమొదటి హారర్ ఫాంటసీ కామెడీ డ్రామా ఇదే కావడం విశేషం. దీంతో సినిమాపై ఫ్యాన్స్‌లో అంచ‌నాలు మరింతగా పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానుంది. ఇక జనవరి 8 నుంచే చాలా చోట్ల ప్రీమియర్స్ పడనున్నయని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో జోష్ మరింతగా పెరిగింది.

The Raja Saab release date: Producer hints Prabhas' film will hit screens  for Sankranthi, avoid clash with Dhurandhar | Hindustan Times

అయితే అభిమానులకు మరో బిగ్ న్యూస్ తాజాగా రాజాసాబ్ సెన్సార్ ను కంప్లీట్ చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీం యూ\ఏ సర్టిఫికెట్ అందజేశారని సమాచారం. అంతేకాదు రన్ టైం3గంట‌ల3 నిమిషాలుగా కట్ చేశారట. అంటే 183 నిమిషాలు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా విషయంలో ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక సినిమాను వీక్షించిన సెన్సార్ టీం రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సరదాగా నవ్వులు పూయిస్తుందని.. ప్రభాస్ మార్క్‌ కామెడీ టైమింగ్స్, హీరోయిజంతో అదరగొట్టాడంటూ చెప్తున్నారు. అంతేకాదు.. మధ్య మధ్యలో వచ్చే కొన్ని హారర్ ఎలిమెంట్స్ ఫాన్స్‌లో థ్రిల్‌ను పెంచేస్తాయట. ఇక ఇంటర్వెల్లో భారీ ట్విస్ట్ ఉంటుందని.. కచ్చితంగా నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆత్రుత ఆడియన్స్‌లో క్రియేట్ చేయడంలో మారుతి సక్సెస్ అయ్యాడ‌ని తెలుస్తుంది.

ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ సన్నివేశాలు, హారర్ థ్రిల్లింగ్ ఎలివేషన్‌తో ముగిసినా.. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచే గ్రిప్పింగ్ స్టోరీ మొదలైందని.. మధ్యలో కాస్త స్లో అనిపించినట్లు తెలుస్తోంది. ఏదైనా.. ప్రస్తుతం సినిమాకు ఉన్న క్రేజ్ రిత్యా ప్రభాస్ పవర్ ఫుల్ యాక్టింగ్, హారర్ ఎలిమెంట్స్, కామెడీ సీన్స్ బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌తో కాంబినేషన్ సీన్స్‌ కచ్చితంగా సినిమాకు హైలెట్ గా మారతాయని.. సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక రివ్యూలను బట్టి చూస్తే.. ప్రభాస్ ఖాతాలో మళ్ళీ బ్లాక్ బ‌స్టర్ పడినట్లే. ఇక సినిమా ఒరిజినల్ రివ్యూ తెలియాలంటే.. జనవరి 8 వరకు వెయిట్ చేయాల్సిందే. సెన్సార్ సభ్యులను ఆకట్టుకున్న ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.