ఏపీ డిప్యూటీ సీఎం.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే.. పవన్ కళ్యాణ్ మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.గత కొంతకాలంగా తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, పవన్ కాంబోలో ఓ పవర్ఫుల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ వార్తల్లో వాస్తవం ఏంటో తెలియదు గాని.. ఆడియన్స్‌లో మాత్రం మంచి బజ్ క్రియేట్ అయింది.

అయితే.. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో, సినిమా షెడ్యూల్స్ లో బిజీబిజీగా గడపడంతో.. వీళ్ళిద్దరి మధ్యన చర్చలు ముందుకు సాగలేదని.. ఈ క్రమంలోనే ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపేసారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం లోకేష్ కనకరాజ్, పవన్ కాంబోలో ప్రాజెక్ట్ మళ్ళి రివైవ్ అయిందట. రాజకీయ బాధ్యతలతో బిజీగా గడుపుతున్న పవన్.. ఇటీవల లోకేష్ నరేట్ చేసిన కొత్త స్క్రిప్ట్‌ను విన్నాడని.. వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టును కెవిఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్లో రూపొందించే అవకాశం ఉంది.

మోడరన్ ప్రజెంటేషన్‌తో, రా ఇంటెన్సిటీతో సినిమా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ కాంబినేషన్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం రాజకీయాల్లో సర్వే గంగా దూసుకుపోతున్న పవన్.. తాజాగా ఇండస్ట్రీలోను అదే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తన స్టార్డం నిలబెట్టుకున్నాడు. ఈ విజయోత్సహంలో పవన్ మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా పవన్, లోకేష్ కనకరాజు కాంబో మళ్లీ రివైవు అవుతుంది అనే వార్తలు మాత్రం అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే.. ఇక ఈ ప్రాజెక్టుపై ఆడియన్స్ లో అంచనాలు ఆకాశానికి అంటుతాయనడంలో సందేహం లేదు.

