టాలీవుడ్ ఇండస్ట్రీలో.. వైవిధ్యమైన సినిమాలతో ఆడియన్స్ను ఆకట్టుకునే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే రవిబాబు అని చెప్పాలి. రెగ్యులర్ కథలకు దూరంగా ఉంటూ.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వస్తున్న ఆయన.. నటుడుగాను ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కాన్సెప్ట్.. కథలు కూడా చాలా వింత వింతగా చూజ్ చేసుకుంటూ ప్రేక్షకులు పలకరిస్తున్నాడు.

అలా ఇప్పటివరకు.. అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, పార్టీ, అమరావతి, అనసూయ, అవును ఇలా తాను తెరకెక్కించిన ప్రతి సినిమా ఓ సపరేట్ స్టోరీ తో వచ్చింది. ఇక.. చాలా కాలం గ్యాప్ తర్వాత మరోసారి రవిబాబు ‘ ఏనుగుతొండం ఘట్టికచాలం ‘ సినిమాతో ఆడియన్స్ను పలకరించాడు. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించాడు.

ఇక ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. కాగా.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవిబాబు మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తెలుగు సినిమాలు నాకు చాలా వింతగా అనిపిస్తాయి.. మన వాళ్ళు యాక్టింగ్ కాదు.. ఓవర్ యాక్టింగ్ చేస్తారు.. నేను కూడా ముందు నార్మల్గానే నటించా. కానీ.. ఓవర్ యాక్టింగ్ చేయాలని తర్వాత అర్థమైంది.. మురారిలో అలాగే ఓవర్ యాక్టింగ్ చేశా.. అది చాలామందికి నచ్చేసింది. విలన్ గా కూడా అలాగే నటిస్తున్న అంటూ కామెంట్స్ చేశాడు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్గా మారుతున్నాయి.

