వెంకటేష్ మూవీ కోసం త్రివిక్రమ్ మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్.. ఇక మారడా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. త‌న సినిమాల్లో కంటెంట్ లేకపోయినా.. మాటల గారడి చేస్తూ ఆడియన్స్‌ను సినిమాకు కనెక్ట్ చేస్తు హిట్ కొడ‌తాడు. ఈ క్ర‌మంలోనే మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇక తాను తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్‌లు అందుకుంటున్న‌ క్రమంలోనే.. త్రివిక్ర‌మ్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్పై ఆడియన్స్‌లోనూ మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఇక ఆయ‌న‌ ప్రస్తుతం.. వెంకటేష్‌తో ఫ్యామిలీ ఓరియంటెడ్ కంటెంట్ డీల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

త్రివిక్రమ్‌ గ్లామర్‌ సెంటిమెంట్‌ రిపీట్‌..? పండగ చేసుకుంటామంటోన్న మహేష్‌  ఫ్యాన్స్ | trivikram repeat two heroines sentiment with mahesh movie also  fans full happy arj | Trivikram ...

ఈ సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకుని.. రికార్డ్ క్రియేట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తాను అనుకున్నట్లుగానే సినిమా మంచి సక్సెస్ అందుకుంటే మాత్రం.. ఆయన పేరు మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలుస్తుంది. ఒకప్పుడు కామెడీ సినిమాలకు క్యారఫ్ అడ్రస్ గా నిలిచిన త్రివిక్రమ్.. ఇప్పుడు డిఫరెంట్ క‌థ‌ల‌తో సినిమాలను ప్రయత్నిస్తూ ఆడియన్స్‌లో ఆసక్తి కల్పిస్తున్నాడు. హాలీవుడ్ లెవెల్లో తెలుగు సినిమాలన్నీ తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా.. వెంకటేష్‌తో తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమా కోసం.. త్రివిక్ర‌మ్.. మళ్లీ తన సెంటిమెంట్లు రిపీట్ చేస్తున్నాడంటూ టాక్‌ వైరల్‌గా మారుతుంది.

Venkatesh-Trivikram welcome Srinidhi Shetty | cinejosh.com

అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటికే సినిమాలో హీరోయిన్గా శ్రీనిధి ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు తనే చాలా ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయిందని త్రివిక్రమ్ పలు సందర్భాల్లో వెల్లడించాడు. ఇక ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో భాగం కానుందట. నిజానికి త్రివిక్రమ్ సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటూ వస్తాడు. మొదటినుంచి ఇది ఓ సెంటిమెంట్‌లా రిపీట్ చేస్తున్నాడు. అలా ఈ మూవీలో ఒకరు శ్రీనిధి శెట్టి కాగా.. మరొక హీరోయిన్‌ ఎవరనే ఆశ‌క్తి ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారుతుంది. అయితే ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి ఒక కొత్త ముద్దుగుమ్మ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని సమాచారం. ఇక ప్రస్తుతం ఈ టాక్ వైరల్ అవ్వడంతో త్రివిక్రమ్ ఇక మారడా.. ఎప్పటికీ ఈ సెంటిమెంట్ రిపీట్ చేస్తాడా.. అంటూ నెటిన్ల నుంచి రకరకాలుగా అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.