ఇండస్ట్రీ ఏదైనా సరే.. ఎప్పటికప్పుడు ప్రతి క్రాఫ్ట్ లోను కొత్త వాళ్ళు ఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ చూపించాలని సక్సెస్‌లు అందుకోవాలని కష్టపడుతూ ఉంటారు. ఒకరిని మించి ఇంకొకరు తమ ఔట్‌పుట్‌తో ఆడియన్స్‌ను మెప్పిస్తూ ఉంటారు. ఇక.. మన టాలీవుడ్‌లో అయితే.. దర్శక రంగంలో అలా.. ఎంతోమంది ఇప్పటికే సక్సెస్ అందుకున్నారు. ఒకప్పుడు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవి తన సినిమాలతో సంచలనాలు సృష్టించి బాలీవుడ్కు వెళ్లి అక్కడ కూడా హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తర్వాత.. రాజమౌళి తన సినిమాలతో టాలీవుడ్ ఖ్యాతి పెంచడమే కాదు.. హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగాడు. ఇక.. వీళ్లిద్దరిలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.

కాగా రాజమౌళి గతంలో ఆర్జీవితో మాట్లాడాలని ఎంతగానో ఎదురుచూసే వాడట. కనపడితే ఎలా మాట్లాడాలో ముందే ప్రిపేర్ అయ్యే వాడినని.. తనకు ఆర్జీవి పై ఉన్న అభిమానం అలాంటిది అంటూ ఎన్నో సందర్భాల్లో వివరించాడు. అంతేకాదు.. ఆర్జీవి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలని ఎంతో ట్రై చేశా అని స్వయంగా చెప్పుకొచ్చాడు. అలాంటి రాజమౌళి ఇటీవల చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. తాజాగా శివ సినిమా రిలీజ్ ఈవెంట్లో నాగార్జున , ఆర్జీవి, సందీప్ రెడ్డి వంగ స్పెషల్ ఇంటర్వ్యూలో సందడి చేశారు. ఇంటర్వ్యూలో ఆర్జీవి మాట్లాడుతూ.. గతంలో రాజమౌళి నాతో ఆర్జీవి లాంటోడు ఎప్పుడో ఒకడు పుడతాడు.. మళ్ళీ ఇప్పుడు సందీప్ పుట్టడేమో అన్నాడు. కానీ.. యానిమల్ మూవీ చూసిన తర్వాత రాజమౌళి నాకు కాల్ చేసి సందీప్‌ని నీతో పోల్చా.. ఆ మాటలను మళ్లీ వెనక్కి తీసుకుంటున్నా.
సందీప్.. ఆర్జీవికా బాప్. నిన్ను మించిపోయాడు అంటూ చెప్పాడని ఆర్జీవి వివరించాడు. దీంతో ఆర్జీవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతున్నాయి. రాజమౌళినే.. సందీప్ రెడ్డి వంగాన్ని ఆ రేంజ్ లో ఎలివేట్ చేశాడంటే.. సందీప్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతోనే తిరుగులేని స్టార్‌డం తెచ్చుకున్న సందీప్.. యానిమల్ తో పాన్ ఇండియా లెవెల్లో పలు విమర్శలు ఎదుర్కొన్న తనదైన మార్క్ మాత్రం క్రియేట్ చేశాడు. తన సినిమా టేకింగ్ స్టైల్, బోల్డ్ మాటలు, యాటిట్యూడ్ తో మరింత వైరల్ గా మారుతున్నాడు. అయితే సందీప్ రెడ్డి శివ సినిమా చూసిన తర్వాతే ఎడిటింగ్ నేర్చుకున్నానని.. నేను ఆర్జీవికి వీరాభిమాని అంటూ ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడించాడు.

