కొలీవుడ్ థలైవార్ రజినీకాంత్.. ఏడుపదుల వయసులోనూ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లతో తన స్టైల్, ఆటిట్యూడ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ జనరేషన్‌ను సైతం.. విపరీతంగా మెప్పిస్తున్నాడు. కాగా.. రజనీకాంత్ తరచూ రిలాక్సేషన్ కోసం హిమాలయాలకు వెళ్లి.. అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారని.. ఆధ్యాత్మిక ప్రదేశాలను సైతం ఎప్పటికప్పుడు సందర్శిస్తూ ఉంటారని.. అందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన గాలి కోసం అక్కడికి వెళ్తారని చాలామంది భావిస్తారు. కానీ.. రజనీకాంత్ కెరీర్‌లో మొట్టమొదటిసారి హిమాలయాలకు వెళ్ళింది మాత్రం హీరోయిన్ మరణం తర్వాత. ఆ హీరోయిన్ మరణం రజనీకాంత్ ను తెగ భయపెట్టేసిందని.. ఈ క్రమంలోనే హిమాలయాలకు పారిపోయాడంటూ న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరోకాదు సౌందర్య. ఆమె మరణం తర్వాత రజనీకాంత్ కు కొత్త భయం పుట్టుకొచ్చింది. ఇంతకీ సౌందర్యం మరణానికి.. రజనీకాంత్ భయానికి కారణం చంద్రముఖినట. రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలో సౌందర్య లేదు కదా.. మరి సౌందర్య చనిపోతే రజనీకాంత్ భయపడటం ఏంటి అని సందేహం మీలో మొదలై ఉంటుంది. అయితే మొదట.. ఈ సినిమాను కన్నడలో ఆప్తమిత్ర పేరుతో రిలీజ్ చేశారు. అక్కడ బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన తర్వాత.. తెలుగు, తమిళ్‌లో చంద్రముఖి సినిమా రిలీజ్ అయింది.
ఇక 2004లో ఆప్తమిత్ర సినిమా షూట్ పూర్తై.. సినిమా రిలీజ్ అయిన తర్వాత సౌందర్య చనిపోయారు. కాగా. ఈ సినిమాలో సౌందర్య చంద్రముఖి రోల్‌లో మెరిశారు. విష్ణువర్ధన్.. రజనీకాంత్ పోషించిన పాత్రలో ఆకట్టుకున్నారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత సౌందర్యం మరణించడం.. ఆ కొద్ది రోజులకే సినిమాలో నటించిన విష్ణువర్ధన్ సైతం చనిపోవడం.. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి.. రజనీకాంత్ దాకా చేరుకుంది. అంతేకాదు.. చంద్రముఖి సినిమాలో వారంతా మరణిస్తున్నారని.. దానికి కారణం చంద్రముఖి దయ్యమే నంటూ అప్పట్లో వార్తలు తెగ వైరల్ గా మారాయి. ఇది సినిమాకు పబ్లిసిటీ తెచ్చి పెట్టిన రజనీకాంత్ లో మాత్రం భయం మొదలైందట. ఈ క్రమంలోనే హిమాలయాలకు వెళ్లి అక్కడ పూజలు చేయించిన రజనీకాంత్.. తిరిగి వచ్చిన తర్వాత మైసూర్ లోని తన సొంత ఇంట్లో కూడా హొమం నిర్వహించినట్లు టాక్.