టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయాల్సిన ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తాజాగా ఆయన చేతుల నుంచి చేజారిపోయిందంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. దానికి అసలు కారణం తాజాగా రిలీజ్ అయిన వార్ 2 . అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో తెరకెక్కి.. ఆగష్ 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాలీవుడ్ లో హిట్ టాక్‌ను దక్కించుకున్నా.. టాలీవుడ్‌లో మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. కలెక్షన్ పరంగా అసలు వర్కౌట్ అవలేదు. ఈ క్రమంలోనే.. ఎన్టీఆర్ ఇమేజ్‌కు చాలా వరకు నెగిటివ్ ప్రభావం పడిందంటూ వార్తలు సైతం వైరల్ గా మారాయి.
ఇక అదే రోజున.. రిలీజ్ అయిన కూలి సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రావడం.. కలెక్షన్ల పరంగా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఈ వార్తలకు మరింత బలం పుంజుకుంది. కూలి సినిమాకు కూడా మిక్స్డ్ రివ్యూలే వచ్చినప్పటికీ.. కలెక్షన్ పరంగా మాత్రం భారీ సక్సెస్ను అందుకుంది. ఇక.. ఈ సినిమాకు డైరెక్టర్గా లోకేష్ కనకరాజు వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా.. త్వరలోనే ఎన్టీఆర్‌తో లోకేష్ కనకరాజ్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడని.. చరణ్‌తో కూడా ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలని ఆయన భావించాడని.. ఎప్పటినుంచో ఓ వార్త తెగ వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే.
అయితే.. కూలి సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన నెగటివ్ ప్రచారాల కారణంగా ఎన్టీఆర్, చరణ్ ఇద్దరు కూడా ఆ ప్రాజెక్టులను వదిలేసారు అంటూ రూమర్ తెగ వైరల్ గా మారుతుంది. అంతేకాదు.. జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించాల్సిన ఆ భారీ ప్రాజెక్టును లోకేష్ కనకరాజ్ ఇప్పుడు కోలీవుడ్‌కు చెందిన మరో స్టార్ హీరోకు ఆఫర్ చేసినట్లు టాక్. ఇప్పటివరకు లోకేష్ డైరెక్షన్‌పై కూలి సినిమా విషయంలో వచ్చిన నెగిటివ్ ప్రచారాలు అన్నింటికి చెక్ పెట్టేలా ఈ సినిమాను డిజైన్ చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఖైదీ 2 సినిమాను భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తూ.. అదే రీతిలో ఈ కొత్త ప్రాజెక్టులు కూడా ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మార్చే ఆలోచనలో లోకేష్ ఉన్నాడట. ఈ క్రమంలోనే మరోసారి లోకేష్‌పై అందరి దృష్టి మళ్లింది. ఈసారైనా.. తన డైరెక్షన్‌తో మ్యాజిక్ చేసి.. మళ్లీ పాత హిట్ ట్రాక్ ను రిపీట్ చేస్తాడా.. లేదా.. నెగిటివ్ కామెంట్స్ నుంచి ఎంతవరకు బయట పడతాడో వేచి చూడాలి.