లైఫ‌కి ఓ అర్ధానిచ్చేది ల‌వ్ ఒక్క‌టే.. ఎక్కువ‌ ప్రేమించండి.. శ్రావణ భార్గవి

టాలీవుడ్ స్టార్ సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర తెలుగులో ఎలాంటి పాపులారిటి సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. వీళ్ళిద్దరూ రియల్ లైఫ్ జంటగాను ఎంతోమందికి ఫేవరెట్ కపుల్ గా మారిపోయారు. అయితే.. గ‌త‌కొద్ది రోజులుగా ఈ జంట విడివిడిగానే జీవిస్తున్నారు. 2022 నుంచి వీళ్ళిద్దరూ విడిపోయారంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అవి అబద్దం అని ఎప్పుడు ఈ జంట క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించలేదు సరి కదా.. కనీసం వాటిని పట్టించుకోను కూడా పట్టించుకోలేదు.

Singer Couple Hemachandra and Sravana Bhargavi Heading for Separation?  Here's What We Know | Movies News - News18

పైగా.. హేమంత్ చంద్ర లేకుండా ఇటీవల కాలంలో శ్రావణ భార్గవి కూతురుతో కలిసి తెగ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. దాంతో వీళ్ళిద్దరూ విడిపోయార‌ని.. ఒంటరిగానే ఉంటున్నారంటూ అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ఇలాంటి క్రమంలో తాజాగా శ్రావణ భార్గవి ప్రేమ గురించి చేసిన ఎమోషనల్ పోస్టు తెగ వైరల్ గా మారుతుంది. లైఫ్ చాలా సెన్సిటివ్ మేటర్. అవసరాలు, గొడవలు, అపార్ధాలు, చికుముడులు అంటూ వీటితో బతికేయడంలో అర్థం లేదు.

ప్రేమ ఒక్కటే లైఫ్‌కు స‌రూన అర్ధం. మన మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమిస్తే తప్పు చేస్తున్నామా అని కొంచెం కూడా బాధపడొద్దు. ఉదరంగా మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి మరింతగా ప్రయత్నించాలి. ఆ ప్రేమే మన లైఫ్ లో గెలిచామా.. ఓడమా.. నిర్ణయిస్తుందంటూ తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇక శ్రావణ భార్గవి సింగర్ గానే కాదు.. సాంగ్స్ రైటర్ గా, హీరోయిన్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను వ్యవహరించింది. 2013లో సింగర్ హేమచంద్రన్ వివాహం చేసుకున్న అమ్మ‌డు 2016లో శిఖర చంద్రికకు జన్మనిచ్చింది.