ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లలో చిరు, నాగార్జున వారసులు ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య, వెంకటేష్ వారసుల సినీ ఎంట్రీ మాత్రమే మిగిలింది. ఇప్పటికే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిపోయిందని.. తన దగ్గర అయిదారు స్టోరీలు ఉన్నాయని.. కచ్చితంగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీతో హిట్ కొడతాడనేలా బాలయ్య ధీమా వ్యక్తం చేశారు. ఇక మిగిలింది వెంకటేష్ తనయుడు అర్జున్. తాజాగా అర్జున్ టాలీవుడ్ ఎంట్రీ పై కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దగ్గుపాటి వారసుడిగా రానా దగ్గుపాటి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అంతా వెంకీ తనయుడు అర్జున్ టాలీవుడ్ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దానికి ఎంతో సమయం లేదని.. ఇప్పటికే టాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది అంటూ టాక్ నడుస్తుంది. ఇక విక్టరీ వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళని సైతం తన సినిమాలు చూసేందుకు థియేటర్లకు రప్పించిన క్రెడిట్ వెంకటేష్ కే సొంతం. కేవలం ఫ్యామిలీ కంటెంట్ కాదు.. మాస్, క్లాస్ అని తేడా లేకుండా దాదాపు అన్ని కంటెంట్లను టచ్ చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 65 ఏళ్ల వయసులోనూ సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు.

ఇక ఇప్పుడు అర్జున్ ఎంట్రీ ఉండబోతుందట. ఇప్పటికే అర్జున్ నటనకు సంబంధించిన ట్రైనింగ్ కూడా విదేశాల్లో కంప్లీట్ చేసుకున్నాడని టాక్ బలంగా వినిపిస్తుంది. వెంకటేష్ తన వారసుడు ఇండస్ట్రీలోకి తీసుకురాబోతున్నాడని అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇంకా అర్జున్ కు హీరో అయ్యేంత ఏజ్ లేదు. ఈ క్రమంలోనే మరో రెండు, మూడేళ్ల గ్యాప్ తర్వాత అర్జున్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని వెంకటేష్ భావిస్తున్నాడట. అయితే.. వెంకటేష్ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారని విషయంలో ఇప్పటికే ఎంతోమంది పేర్లు వినిపించాయి. యంగ్ డైరెక్టర్‌లతో తన కొడుకు ఎంట్రీకి వెంకీ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అయితే.. కొంతమంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొడుకు డైరెక్షన్‌లో వెంకటేష్ కొడుకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ కొడుకు ఆకీర్ ఎంట్రీ కూడా త్రివిక్రమ్ కొడుకు డైరెక్షన్లోనే ఉండబోతుందట. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. నిజమైతే మాత్రం కచ్చితంగా ఈ స్టార్ కిడ్స్ డెబ్యూ ఆడియన్స్ లో మంచి హైప్ ను క్రియేట్ చేస్తుంది.

