తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఫారెస్ట్ బాక్ డ్రాప్ అడ్వెంచరస్ డ్రామాగా సినిమా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే.. సినిమా కోసం కేవలం మహేష్ రాజమౌళి అభిమానులే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాను గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేస్తూ.. జక్కన్న ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. 2027 సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇక.. సినిమాను ఏకంగా 100కు పైగా దేశాల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

కాగా.. ఒకేసారి అన్ని దేశాల్లో రిలీజ్ చేస్తారా.. లేదా గ్యాప్ తీసుకుని రిలీజ్ చేస్తారా అనే క్లారిటీ రావాల్సి ఉంది. అదే టైంలో జపాన్‌లో కూడా వారణాసి గ్రాండ్గా రిలీజ్ అవ్వనున్నట్లు టాక్. టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేయకున్నా.. జపాన్ ఐమాక్స్ తన సోషల్ మీడియాలో ఇన్‌డైరెక్ట్ హింట్ ఇచ్చింది. రీసెంట్గా వారణాసి గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తూ.. 2027లో రిలీజ్ అంటూ రాస్కొచ్చింది. దీంతో జపాన్లో పెద్ద ఎత్తున సినిమా రిలీజ్ అవుతుందని అంత భావిస్తున్నారు. అయితే.. ఇప్పటికే జక్కన్న డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‌లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కాగా.. అప్పుడు జపాన్‌లో సినిమాలు లేటుగా రిలీజ్ చేసినా.. అక్కడి బాక్సాఫీస్ వద్ద మాత్రం బ్లాక్ చేసే రేంజ్ లో వసూళ్లు వచ్చాయి. ఇక ఇప్పుడు జపాన్ రిలీజ్‌లో ఎలాంటి ఆలస్యం చేయకూడదని రాజమౌళి అండ్ టీం ఫిక్స్ అయ్యారట. దానికి సంబంధించిన పనులు కూడా మొదలెట్టేసారని తెలుస్తుంది. అక్కడ ఆర్‌ఆర్ఆర్‌కు మించిన రేంజ్‌లో వారణాసి రిలీజ్ అవనుందని.. ఒక్కసారి పాజిటివ్ వైబ్ క్రియేట్ అయితే చాలు.. ఇక రికార్డులకు ఊచకోత మొదలైపోతుంది అంటూ చెబుతున్నారు. అంతేకాదు.. రిలీజ్‌కు ముందే.. ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేయాలని ప్లాన్‌లో కూడా ఉన్నాడట జక్కన్న.

