శంబాలా టూ ఈషా.. క్రిస్మస్ సినిమాల్లో విన్నర్ ఎవరు..?

ఇండస్ట్రీ ఏదైనా సరే ఆడియన్స్ అంతా ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలకే ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వాళ్ళ సినిమాలు ఎలాంటి రిజ‌ల్ట్ అందుకున్నా.. మినిమం కలెక్షన్లు వచ్చేస్తాయి. కానీ.. చిన్న సినిమాల విషయంలో మేకర్స్‌ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో కష్టపడాలి. స‌రైన కంటెంట్ ఉంటేనే సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోగలుగుతుంది. అలా.. ఇప్పటికే ఏడాదిలో లిటిల్ హార్ట్స్‌, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సినిమాలు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక.. 2025 తుది ద‌శ‌కు చేరుకున్న క్రమంలో చివరి వారం కావడంతో.. క్రిస్మస్‌ని టార్గెట్ చేసుకొని.. చాలా చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి. వాటిలో ఏ సినిమాలు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ బరిలో రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో ఏ సినిమా విన్నర్ గా నిలిచిందో ఒకసారి చూద్దాం.

శంబాలా :
అది సాయికుమార్ హీరోగా.. యుగంధర్ మున్ని డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన లేటెస్ట్ మూవీ శంబాలా. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుందని చెప్పాలి. కథను అద్భుతంగా రాసుకున్న ఈ దర్శకుడు.. దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలోనూ 100% సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాలో ట్విస్టులు, సస్పెన్స్ లు అక్కడక్కడ కామెడీని కూడా వర్కౌట్ చేస్తూ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా కంటెంట్ చూపించారు. ఇక ఆది సాయికుమార్ కూడా తన కెరీర్ లోనే ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారని.. మాటలతో ఆడియన్స్ను ఆకట్టుకున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు వరకు సినిమా చూసిన ఆడియన్స్ నుంచి వస్తున్న టాక్ ప్రకారం.. సినిమా సక్సెస్ తీరాలకు చేరుకుంది.

ఛాంపియన్:
శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. నిన్న క్రిస్మస్ బారిలో రిలీజ్ అయింది. ప్రొడ్యూసర్ అశ్వినీ ద‌త్ కూతురు స్వప్న ద‌త్‌ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసింది. అయితే వైజయంతి బ్యానర్స్ మేకింగ్ ఆఫ్ క్వాలిటీ సినిమాలో కనిపించినా.. కంటెంట్ విషయంలో పెద్దగా ఆకట్టుకోలేదని.. నటినటులు త‌మ పాత్ర‌ల‌తో మెప్పించినా.. కంటెంట్ వీక్‌గా ఉండడంతో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే.. ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే యావరేజ్ టాక్ దక్కించుకుంది. దీంతో సినిమా చూసేందుకు ఆడియన్స్ కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

Dandora Movie Review: శివాజీ 'దండోరా' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? |  సినిమా - News18 తెలుగు

దండోరా:
శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు కాంబోలో విలేజ్ బ్యాక్ డ్రాప్‌ స్టోరీగా తెర‌కెక్కిన మూవీ దండోరా. ఇటీవల కాలంలో విలేజ్ డ్రామాగా వ‌చ్చిన‌ సినిమాలు దాదాపు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇక.. ఈ సినిమా కూడా ఒక విలేజ్‌ డ్రామాగా ఆడియన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేసింది. అయితే.. అక్కడక్కడ కథ‌ వర్కౌట్ కాలేదని అంటున్నారు. ఈ క్రమంలోనే సినిమా యావరేజ్ టాక్ ను దక్కించుకుంది.

Trailer 🤯, #eesha #eeshamovie #EeshaonDec12th #isha #ishaondec12th

ఈషా:
ఏడాదిలో ఇప్పటికే రాజు వెడ్స్‌ రాంబాబు సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో అఖిల్ రాజ్.. ఈషా సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించాడు. సినిమాలో హెబ్బా పటేల్, సిరి హనుమంత్ హీరోయిన్లుగా కనిపించారు. ఈ సినిమా సైతం క్రిస్మస్ బరిలో నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది. హారర్ బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా వ‌చ్చిన‌ పెద్దగా మేకర్స్ హారర్ కంటెంట్ ను చూపించలేకపోయారు. ఈ క్రమంలోనే సినిమా ఆడియ‌న్స్‌కు కనెక్ట్ కాలేదు. సినిమాకు ఫస్ట్ డేనే నెగటివ్ టాక్ వచ్చింది. ఇక.. ముందు ముందు ఈ ప్రభావం కలెక్షన్ల పై పడే అవకాశం ఉంది. అలా.. ఇప్పటివరకు క్రిస్మస్ బరిలో రిలీజ్ అయిన నాలుగు సినిమాలలో ఆది సాయికుమార్ శంబాలతో సక్సెస్ కొట్టి విన్నర్ గా కొనసాగుతున్నాడు.