” ది రాజాసాబ్ ” క్రిస్మస్ సర్ప్రైజ్.. డార్లింగ్ తో నిధి లవ్ సాంగ్ ప్రోమో..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న హారర్ కామెడీ థ్రిల్ల‌ర్ ది రాజాసాబ్‌. సంక్రాంతి బరిలో గ్రాండ్ లెవెల్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే.. క్రిస్మస్ సర్ప్రైజ్‌ను కూడా ఇచ్చేశారు. ఈ మూవీ నుంచి థర్డ్ సాంగ్స్ రాజే యువ‌రాజే.. కొలిచేటి తొలిప్రేమికుడే అంటూ.. చర్చ్‌లో సాగే ఈ లవ్ సాంగ్ లిరిక్స్ రిలీజ్ చేశారు. ఆడియన్స్‌ను ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది.

ఇక.. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన రెబల్ సాబ్, సహనా.. స‌హానా.. లవ్ మెలోడీ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ముచ్చటగా ఈ మూడో సాంగ్‌లో ప్రభాస్, నిధి అగర్వాల్ కలిసి సందడి చేశారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ సాంగ్ స్పెషల్ ప్రోమో వీడియోలు రిలీజ్ చేయగా.. అది కొద్ది క్షణాల్లోనే నెటింట తెగ‌ వైరల్‌గా మారింది. ఇక త్వరలోనే.. ఈ మూవీ ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రభాస్ కెరీర్‌లో ది రాజాసాబ్ మూవీతో మొదటిసారి హారర్ కామెడీ జోనర్‌ను ట్రై చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌లో సినిమాపై మంచి హైప్‌ మొదలైంది. ఇప్పటికీ రిలీజ్ చేసినా లుక్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్‌లో గూస్‌బంప్స్‌ తెప్పించాయి. ఇదే సినిమాలో ప్రభాస్ స‌ర‌స‌న నిధి అగర్వాల్, రిద్ది కుమార్.. మాళవిక మోహన్ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వీళ్ళతో పాటు.. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ మర పవర్ ఫుల్ రోల్‌లో మెరువనున్నారు. సప్తగిరి, విటీవీ గణేష్ కీలక పాత్రలో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా రూపొందిన ఈ సినిమా.. పాన్ వరల్డ్ లెవెల్‌లో జనవరి 9న ఆడియన్స్ ముందుకు రానుంది.