2025 తుది దశకు చేరుకుంది. టాలీవుడ్‌కు ఈ ఏడాదిలో ఇక మిగిలింది కేవలం ఒక్క వారమే. ఈ క్రమంలోనే ఈ ఫైనల్.. ఇయర్ండ్ వీకెండ్ టార్గెట్ చేసుకొని.. ఎన్నో సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. క్రిస్మస్ సీజన్ లో యంగ్ హీరోలే సందడి చేస్తారు. అయినా ఈ సారీ వాళ్ళకు పోటీగా.. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్‌లాల్ సైతం వృషభతొ రంగంలోకి దిగారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్న.. వృషభ సినిమాను డిసెంబర్ 25న రిలీజ్ చేసేందుకు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ సినిమాల కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. ఇంతకీ క్రిస్మస్ బారిలో ఉన్న ఆ సినిమాల లిస్టు ఏంటో.. వాటిలో విన్నర్ ఎవరుగా నిలుస్తారు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇక ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

అది సాయికుమార్ – శంభాల, రోషన్ మేక – ఛాంపియన్ సినిమాల మధ్య టఫ్ కాంపిటీషన్ మొదలైంది. సడన్గా ఈ రేసులోకి వృషభ వచ్చి చేరడంతో ఈ పోటీ మరింత హైప్ నెలకొంది. వరుస ప్లాపులతో ఉన్న అది సాయికుమార్ శంభాలతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొడతామని.. స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోపక్క.. రోషన్ పెళ్లి సందడి సినిమా తర్వాత.. చాలా గ్యాప్ తీసుకుని ఛాంపియన్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే.. ఈ సినిమాపై కూడా ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. వీటితో పాట్టే.. శివాజీ, బిందుమాధవి ప్రధాన పాత్రలో నటించిన దండోరా సినిమా కూడా అదే రోజున రిలీజ్ కు సిద్ధమవుతుంది.
ఇక డిసెంబర్ 12న రావాల్సిన ఈషా సినిమా సైతం అఖండ 2 తో బాలయ్య రేసులోకి రావడంతో.. 25 కు షిఫ్ట్ అయింది. ఈ సినిమాలో త్రీ గుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించనున్నారు. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ సైతం ఆడియోస్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ హారర్ మూవీతో ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్‌కి తీసుకురావడం కాయమంటూ టీం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదు సినిమాలతో పాటు.. పథంగ్ అనే యూత్ ఫుల్ లవ్ స్టోరీ కూడా క్రిస్మస్ బరిలో రిలీజ్ కు సిద్ధమవుతోంది.
![]()
ఇన్ని సినిమాల మధ్య కాంపిటీషన్ ఉండగా సడన్గా బ్యాడ్ గర్ల్స్ మూవీ ఈ రేస్ లోకి అడుగు పెట్టింది. పేరు కాస్త తేడాగా అనిపించినా.. మంచి సందేశం తో సినిమా వస్తుందని సమాచారం. కన్నడ – మార్క్ సినిమా కూడా అదే రోజున రిలీజ్ అవుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు అరడజనుకు పైగా సినిమాలు రంగంలో ఉండగా.. ఈ రేసులో ఫైనల్ విన్నర్ గా ఎవరు మారతారు అనే ఆసక్తి ఆడియన్స్‌లో మొదలైంది. మరీ విన్నర్ తెలియాలంటే సినిమాలో రిలీజ్ అయ్యి రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

