టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఆడియన్స్లో ఉన్న మాస్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు వైవిధ్యమైన కథలతో ఆడియన్స్‌ను మెప్పించిన బోయపాటి.. ఇక బాలయ్యను ఎలివేట్ చేయడంలో అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. తాజాగా.. బోయపాటి.. బాలకృష్ణతో అఖండ 2 తాండవం తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు. కేవలం మొదటి రోజే రూ.59 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఒక్కసారిగా ఆడియన్స్ లో భారీ పాజిటివిటీని దక్కించుకుంది.
వానిజ్య అంశాలను జోడిస్తూ.. డివోషనల్ టాచ్‌తో మాస్ యాక్షన్ సినిమాగా.. ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక తాజాగా.. బోయపాటి ఓ ఇంటర్వ్యూల సందడి చేశాడు. ఇందులో భాగంగా.. పవన్ కళ్యాణ్‌తో మీరు ఎప్పుడు సినిమా చేస్తారంట యాంకర్ ప్రశ్నకు.. బోయపాటి రియాక్ట్ అయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పొలిటికల్ అంశాల మీద పవన్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని.. ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు.. దీంతో లిమిటెడ్ డేట్స్ ఇస్తున్నారు. నాతో సినిమా తీయాలంటే.. అలాంటి లిమిటెడ్ డేట్స్ లో సినిమా కుదరదు. నాకు హీరోల డేట్స్ బల్క్‌లో కావాలని బోయపాటి వివరించాడు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ గారు బల్క్ లో డేట్స్ ఇచ్చే అవకాశాలు లేవు. కనుక.. ఆయనతో సినిమా చేయకపోవడమే బెటర్ అని ఆలోచిస్తున్నా అంటూ బోయపాటి కామెంట్ చేశాడు. పవన్ గారితో సినిమా చేయాలని నాకు ఉంది. కానీ.. అది కుదరకపోవచ్చేమో అంటూ బోయపాటి శ్రీను కామెంట్ చేసాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఇక.. తాజాగా జరిగిన అఖండ 2 సక్సెస్ మీట్‌లో బోయపాటి ఈ కామెంట్స్ చేయడం విశేషం. ఇక అఖండ 2 సినిమాను భారత ప్రధానమంత్రి మోడీ త్వరలోనే స్పెషల్ షో లే చూడడానికి సిద్ధమవుతున్నారట.



