బిగ్బాస్ సీజన్ 9కు మరికొద్ది గంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈరోజు రాత్రి జరిగే ఫైనల్ ఎపిసోడ్ తో బిగ్ బాస్ టైటిల్ రేసులో కప్పు కొట్టింది ఎవరో తేలిపోతుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికే ఫినాలే షూట్‌కు సంబంధించిన ప్రీ ప్రిపరేషన్ పనులన్ని కంప్లీట్ అయ్యాయట. ఇక సీజన్ విన్నర్ ఎవరనే దానిపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఆడియన్స్లో ఆసక్తి రేకెత్తిస్తున్న మరో ప్రశ్న ఈసారి ఫినాలేకు వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరు.. గతేడాది చీఫ్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సీజన్కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా వస్తారంటూ వార్తలు వినిపించాయి. ఆయన తర్వాత రెబల్ సార్ ప్రభాస్ పేరు కూడా వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ షోకు స్పెషల్ గెస్ట్ గా రావడం లేదని.. ఎవరి షూటింగ్లో వాళ్ళు బిజీగా ఉండడంతో ఆ ప్లాన్స్ వర్కౌట్ కాలేదని తెలుస్తుంది. కాగా.. ఈ సీజన్ కు మాత్రం ఓ క్రేజీ ఎనర్జిటిక్ స్టార్ హీరో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.
అతను మరెవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ. ఎస్.. ఈసారి స్పెషల్ గెస్ట్ గా ఆయన సందడి చేయనున్నాడని విశ్వసనీయవర్గాల సమాచారం. రవితేజ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆయన బిగ్ బాస్ స్టేజ్ పై అడుగుపెట్టనున్నడని.. అంతేకాదు గ్రాండ్ ఫినాలే విన్నర్ కప్పు కూడా రవితేజనే అందించబోతున్నాడని తెలుస్తుంది. ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారడంతో రవితేజ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. మరి ఫైనల్ రైస్ లో విన్నారుగా ఎవరు నిలుస్తారో చూడాలి.

