మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పటినుంచి ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. దానికి తగ్గట్టుగా.. సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, సాంగ్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. చివరిగా.. వచ్చిన చిక్కిరి చిక్కిరి సాంగ్ అయితే సోషల్ మీడియాను బ్లాక్ చేసిందని చెప్పడంలో సందేహం లేదు. మార్చ్‌లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుందని.. చరణ్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఓ స్టార్ హీరో పిఆర్ టీం.. పెద్ది సినిమాకు వ్యతిరేకంగా నెగెటివిటీ పెంచేలా ప్రచారం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఆ హీరో ఎవరు.. అంత నెగటివ్గా ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది.. అంటూ చరణ్ ఫ్యాన్స్ సెర్చింగులు మొదలు పెట్టారు. అయితే.. ఆ స్టార్ హీరోతో చరణ్‌కు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి పడటం లేదట. ఈ క్రమంలోనే చరణ్ కు వ్యతిరేకంగా స్టార్ హీరో టీం తన సినిమాలన్నీటిని నెగిటివ్ చేస్తున్నారట. అయితే.. చరణ్ మాత్రం ఆ హీరో పై అలాంటివి రివెంజ్ తెచ్చుకోవడం లేదని.. మేము కూడా నిశ్శబ్దంగా ఉన్నామంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఒకరికి వ్యతిరేకంగా, ఒకరిని కించపరిచేలా మా చరణ్ ఎప్పుడు వ్యకహరించడంటూ.. చిరంజీవి – సురేఖ దంపతులు అంత గొప్పగా ఆయనను పెంచారంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇద్దరు హీరోస్ గతంలో చాలా క్లోజ్ గా ఉండేవారు. కారణమేంటో తెలియదు కానీ.. వాళ్లు విడిపోయి ఏళ్ళు గడుస్తున్నా.. ఇప్పటికీ కలవలేదు. పెద్ద సినిమాపై నెగిటీవ్ ప్రచారం చేస్తున్న ఆ హీరోది మొత్తం తప్పంటూ టాలీవుడ్ వర్గాల సమాచారం. గొడవ తర్వాత.. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు. కానీ.. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు కలవాల్సి వచ్చిందట. ఇక.. ఆ ఇద్దరు హీరోల మధ్యన గొడవ ఏదైనా.. ఒక మంచి సినిమాను నెగటివ్ ప్రచారం చేయించడం అసలు సరైనది కాదని.. చరణ్ కూడా తిరిగి అదే పని చేస్తే ఎలా ఉంటుంది.. కానీ అలా చేయడు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ స్టార్ హీరో మాత్రం బయటకు రవీల్ కాలేదు.



