టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజీ డైరెక్టర్ సుజిత్‌కు కాస్ట్లీ కార్‌ను గిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక స్ట్రాంగ్ కారణమే ఉందని.. పవన్ కళ్యాణ్ భారీ స్కెచ్ వేసాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్న అకీరా.. ఎంట్రీ కోసం ఎన్నో కథలు కూడా వింటున్నాడట పవన్.

తన కొడుకుని హీరోగా మార్చే బాధ్యత ఇప్పటికే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేతిలో పెట్టినట్లు తెలుస్తుంది. ఇక.. ఈ సినిమా కోసం ఓజీ డైరెక్టర్ సుజిత్.. దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. 21ఏళ్లకే ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ ప్రాజెక్టును అకీరా కోసం సిద్ధం చేస్తున్నారట. శర్వానంద్‌తో రన్ రాజా రన్ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన సుజిత్.. తర్వాత ప్రభాస్ సాహో చేసాడు. తర్వాత.. పవన్ ఓజీ సినిమాతో సంచలనం సృష్టించాడు.

సెప్టెంబర్ 25న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ రికార్డ్ లెవెల్ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ కాకపోయినా.. పవన్ ఫ్యాన్స్‌లో మాత్రం ఫుల్ జోష్‌ను నింపింది. ఈ క్రమంలోనే.. తాజాగా పవన్, డైరెక్టర్ సుజిత్ కు కాస్ట్లీ గిఫ్ట్ ప్రజెంట్ చేశాడని ప్రచారం వైరల్ గా మారింది. కాగా..ఇప్పుడు ఓజీ 2 వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే తన కొడుకును వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను సుజిత్ కు అప్పగించాడట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

