సౌత్ స్టార్ హీరోయిన్ తాప్సీ పొన్నుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 2017లో ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ సోయగం.. కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామర్ పాత్రలో నటించిన తర్వాత.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్పింక్, తప్పడ్, బాధల్ లాంటి సినిమాలతో తన నటనను చాటుకుంది.

ఇక తాప్సి పర్సనల్ విషయానికి వస్తే.. ముక్కుసూటిగా మాట్లాడే తీరు.. పాత్ర కోసం ఎలాంటి సవాళ్లు అయినా స్వీకరించే పట్టుదల పవర్ ఫుల్ బ్యూటీగా నిలబెట్టాయి. ఇక.. ప్రస్తుతం నిర్మాతగాను సత్తా చాటుతుంది. కాగా.. ఏంటి సీన్‌లైనా ఎంత అందగత్తెలకైనా.. ఎలాంటి హీరోలకైనా బాడీ షేమింగ్ కామన్ గానే ఉంటుంది. ఈ క్రమంలోనే తాను కూడా ఎన్నో వివక్షులు ఎదుర్కొన్నానని షాకింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తాప్సి పోన్ను సహజమైన రింగుల జుట్టు వల్ల చాలామంది దర్శకులను గ్లామర్ రోల్‌కు పనికిరావు అని తీసేసే వారని ఎమోషనల్ అయింది.

ఆ టైంలో.. చుట్టుపక్కల వారిని చూసి నా జుట్టు ఎందుకు ఇలా ఉందని నన్ను నేనే అసహ్యించుకునేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. దర్శకులు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద హెయిర్ బ్రాండ్లు కూడా తన రింగుల జుట్టుతో యాడ్స్ చేయడానికి నిరాకరించారని.. షూటింగ్ టైంలో జుట్టును స్ట్రైట్ చేయాలని కండిషన్ పెట్టే వారిని.. తాప్సీ వివరించింది. గ్లామర్ అంటే కేవలం ఒకే రకమైన లుక్ అని నమ్మే ఈ విధానాన్ని నేను చాలా ఎదుర్కొన్నా.. తీవ్ర నిరాశకు గురయ్యానంటూ చెప్పుకొచ్చింది. అయితే.. మెల్లమెల్లగా నా నేచురల్ లుక్ ను ప్రేమించడం నేర్చుకున్నా.. ఇప్పుడు నా కర్లీ హెయిరే నాకు గుర్తింపుగా మారిందంటూ వివరించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.

