” వారణాసి ” బడ్జెట్ డబుల్ కావడానికి కారణం మీరేనా.. యాంకర్ ప్రశ్నకు ప్రియాంక చోప్రా రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ దర్శకథీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న అడ్వెంచర్స్ మూవీ వారణాసి. ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవెల్ కాదు.. గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేస్తూ జక్కన్న ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరిగా గ్లోబల్ ట్రోట‌ర్ ఈవెంట్ చేసి టైటిల్‌ను సాన్ వ‌రల్డ్ లెవెల్‌లో రివీల్ చేశరు. ఇక వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడంతో ఆడియన్స్‌లోను మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో హీరోయిన్గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మెర‌వ‌నుంది.

అయితే.. ఈ మూవీ బడ్జెట్‌పై ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక.. రాజమౌళి అంటే బడా సినిమాలకు క్యారాఫ్ అడ్రస్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా ఖర్చుపెట్టి మరి ఆర్ఆర్ సినిమాను రూపొందించిన ఆయన.. మహేష్ వారణాసి కోసం ఏకంగా రూ.1200 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు టాక్. అయితే ఇది అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. రూ.1000కోట్లకు పైగానే ఉండొచ్చని సినీ విశ్లేషకులు సైతం చెప్తున్నారు.

When the desi girl arrives, things get Pri-etty humorous 😉❤️‍🔥 Watch Priyanka Chopra in the premiere episode of The Great Indian Kapil Show's new season, streaming from 20th December, at 8 PM,

ఈ క్రమంలోనే వారణాసి బడ్జెట్ విషయంలో ప్రియాంక చోప్రాకు ఇంట్రెస్టింగ్ క్వ‌స్షన్ ఎదురైంది. కపిల్ శర్మ షోకు హాజరైన ప్రియాంక చోప్రాకు.. కపిల్ శర్మ ఫన్నీ క్వ‌ష్చ‌న్స్ సందించాడు. వారణాసి మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లని విన్నాం. కానీ.. మీరు ఆ ప్రాజెక్టులో జాయిన్ అయ్యాక అది కాస్త డబల్ అయిందట కదా.. నిజమేనా అని అడగగా.. దానికి హీరోయిన్ రియాక్ట్ అవుతూ.. అంటే బడ్జెట్లో సగం డబ్బులు నా ఖాతాలో పడ్డాయని మీరు అంటున్నారా అంటూ ఫన్నీ రియాక్షన్ ఇచ్చింది. ఈ సమాధానం తో మొత్తం షో అంతా నవ్వుల పూసింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది.